E-Paper
Advertisement

Jananayagan Film: విజయ్ జననాయగన్ కు మరో దెబ్బ.. ఈ సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందేనా?

Jananayagan Film: విజయ్ జననాయగన్ కు మరో దెబ్బ.. ఈ సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందేనా?
Advertisement

Jananayagan Film: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు విజయ్ థళపతి  (Vijay Thalapathy)జననాయగన్(Jananayagan) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9వ తేదీనే విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమా విడుదల గురించి చిత్ర నిర్మాతలు కోర్టుకు వెళ్లిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల అవుతుందా? లేదా అనే సందిగ్ధంలో అభిమానులు కూడా ఉన్నారు.

రూ. 120 కోట్ల అమెజాన్ డీల్ ..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు మరో ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా యధావిధిగా విడుదలవుతుందన్న నేపథ్యంలో జన నాయగన్ ఓటీటీ హక్కులను ప్రముఖ సమస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)ఏకంగా 120 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ ఈ డీల్ క్యాన్సిల్ చేసుకున్నట్టు ఇండస్ట్రీ సమాచారం. ముందుగా అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల కానీ నేపథ్యంలోనే అమెజాన్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసిన అమెజాన్..

Advertisement

విజయ్ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాలి అంటే అమెజాన్ ప్రైమ్ లేదా కెవిన్ ప్రొడక్షన్స్ స్పందించాల్సి ఉంది. ఇక ఈ సినిమా విజయ్ సినీ కెరియర్ లోనే ఎంతో కీలకంగా మారిన సినిమా అని చెప్పాలి హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విజయ్ ఆఖరి సినిమా కావటం విశేషం. ఈ సినిమా తర్వాత ఈయన పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్న నేపథ్యంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. ఇలా విజయ్ ఆఖరి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.

విడాకుల వివాదంలో విజయ్..

Advertisement

ఈ సినిమా విడుదల విషయంలో ఎదురవుతున్న ఆటంకాలను చూస్తుంటే అభిమానులు ఈ సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందేనా అంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా విజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే ఎదురవుతున్న ఆటంకాలను దాటుకొని  విడుదల అయ్యేనా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం విజయ్ ఈ సినిమాని పూర్తిగా పక్కనపెట్టి తన రాజకీయ కార్యకలాపాలపై దృష్టి సారించారు ఈయన టీవీకే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే .ప్రస్తుతం ఈ పార్టీ ప్రచార కార్యక్రమాలలో బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు తన భార్య సంగీత విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడంతో విజయ్ పెద్ద ఎత్తున విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు.

Also Read: Monalisa Bhosle: నా పెళ్లి లవ్ జిహాద్ కాదు.. పెళ్లి పై మోనాలిసా షాకింగ్ రియాక్షన్ ..

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×