E-Paper
Advertisement

VK Naresh: ఆమె నా అదృష్ట దేవత.. ప్రేయసి పై నరేష్ కామెంట్స్!

VK Naresh: ఆమె నా అదృష్ట దేవత.. ప్రేయసి పై నరేష్ కామెంట్స్!
Advertisement

VK Naresh:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రూమర్డ్ జంటగా ఎన్నో జంటలు సినీ ఇండస్ట్రీలో తారస పడుతున్నాయి. అలాంటి జంటలలో సీనియర్ రూమర్డ్ జంటగా పేరు దక్కించుకుంది పవిత్ర లోకేష్ (Pavitra Lokesh), వీకే నరేష్ (VK Naresh). నిజానికి వీరిద్దరూ పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పలు సినిమాలలో కలిసి నటించడమే కాకుండా నిజజీవితంలో కూడా కలిసి జీవిస్తూ పలు ఫంక్షన్లకి జంటగా హాజరవుతూ.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా వీకే నరేష్ పవిత్ర లోకేష్ పై ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆమె వల్లే తనకు అదృష్టం కలిసి వచ్చిందని , ఆమె తన లక్కీ చార్మ్ అంటూ పవిత్ర లోకేష్ పై ప్రశంసలు కురిపించారు నరేష్.

పవిత్ర నా అదృష్ట దేవత..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ‘శుభకృత నామ సంవత్సరం’ మూవీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న నరేష్.. పవిత్ర గురించి మాట్లాడుతూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. నరేష్ మాట్లాడుతూ..” నా ఇన్నేళ్ల సినీ అనుభవంలో అదృష్టం ఆమె వల్లే కలిసి వచ్చింది. నా లైఫ్ లోకి వచ్చాకే నాకు సక్సెస్ మొదలయ్యింది. ఆమె నా అదృష్ట దేవత ” అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నరేష్ చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రోజులో 30 నిమిషాలు మాత్రమే..

Advertisement

అనంతరం పవిత్ర లోకేష్ మాట్లాడుతూ నరేష్ పై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించింది.” దాదాపు 54 సంవత్సరాల సినీ కెరియర్ ఆయనది. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తితో నేను జీవించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో మాట్లాడేందుకు నాకు కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే దొరుకుతుంది. అంత ఫుల్ బిజీగా ఉంటారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. కన్నడ నిర్మాత తెలుగు సినిమా చేయడం అనేది మరింత సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగులో నన్ను అభిమానిస్తున్నారు కానీ అమ్మ భాషపై నాకు మమకారం ఎక్కువ. నరేష్ వల్లే నేను తెలుగు ఇంకా బాగా మాట్లాడుతున్నాను” అంటూ పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో వేదికగా ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు.

శుభకృత నామ సంవత్సరం సినిమా విశేషాలు..

శుభకృత నామ సంవత్సరం సినిమా విషయానికి వస్తే.. ఇందులో నరేష్ కీలక పాత్ర పోషించారు. ధనుంజయ – ప్రకృతి జంటగా నటించిన ఈ సినిమాకి ఎస్ఎస్ సజ్జన్ దర్శకత్వం వహించారు. డి ఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం , హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సుధా శ్రీనివాస్ సంగీతం అందించారు. ఇక తాజాగా ప్రేక్షకులలో అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. కాబట్టి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Advertisement

ALSO READ:Chiru 158: చిరంజీవి – బాబీ మూవీకి ముహూర్తం ఫిక్స్.. పూజా కార్యక్రమం ఎప్పుడంటే?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×