E-Paper
Advertisement

Pawan Kalyan Martial Arts: పవన్ కళ్యాణ్‌కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు..!

Pawan Kalyan Martial Arts: పవన్ కళ్యాణ్‌కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు..!
Advertisement

Pawan Kalyan Martial Arts: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు.. మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. జపాన్‌కు చెందిన ప్రాచీన ఖడ్గ విద్య అయిన కెంజుట్సు (Kenjutsu) లో ఆయనను అధికారికంగా.. చేర్చారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు. ఇదే సందర్భంలో ఆయనకు..టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే ప్రత్యేక బిరుదును కూడా ప్రదానం చేశారు.

పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్ అంటే చిన్ననాటి నుంచే ఆసక్తి. సినిమాల్లోకి రావడానికి ముందే చెన్నైలో ఉన్న రోజుల్లో కరాటే, ఇతర యుద్ధ కళల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. కేవలం శారీరక శిక్షణతోనే కాకుండా, జపాన్ సమురాయి సంప్రదాయాలు, యుద్ధ తత్వం మీద కూడా లోతైన అధ్యయనం చేశారు. ఇదే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది.

Advertisement

సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ తన మార్షల్ ఆర్ట్స్ పరిజ్ఞానాన్ని చూపించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, తాజాగా వచ్చిన ఓజి (They Call Me OG) వంటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ సహజంగా, నమ్మకంగా కనిపించడానికి ఆయన శిక్షణే కారణం. ప్రేక్షకులు కూడా ఈ యాక్షన్‌ను ఎంతో ఆదరించారు.

మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన నిబద్ధతకు గుర్తింపుగా, జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థ సోగో బుడో కాండ్రీ కై నుంచి ఫిఫ్త్ డాన్ (5వ డాన్) గౌరవాన్ని అందుకున్నారు. అలాగే జపాన్ వెలుపల, టకెడా షింగెన్ క్లాన్ లోకి చేర్చబడిన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు. ఇది చాలా అరుదుగా ఇచ్చే గౌరవం.

Advertisement

అంతేకాకుండా.. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే బిరుదును ఇచ్చింది. ప్రముఖ బుడో గురువు ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ వద్ద పవన్ కళ్యాణ్ కెండోలో కూడా ఉన్నత స్థాయి శిక్షణ పొందారు.

ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమతుల్యంగా కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్, భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గర్వకారణంగా నిలుస్తున్నారు. ఆయన సాధించిన ఈ మార్షల్ ఆర్ట్స్ గౌరవంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన విజయాన్ని ఆనందంతో జరుపుకుంటున్నారు..

ALSO READ:Vijay Thalapathy : విజయ్ ఆఖరి సినిమా అనిల్ రావిపూడితో చేయాల్సిందా.. మరేమైందంటే?

Related News

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×