E-Paper
Advertisement

Pooja Hegde : పూజా హెగ్డే క్రేజీ అప్‌డేట్..ఆ హీరో సినిమాలో బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్..?

Pooja Hegde : పూజా హెగ్డే క్రేజీ అప్‌డేట్..ఆ హీరో సినిమాలో బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్..?
Advertisement

Pooja Hegde : టాలీవుడ్ సెన్సేషన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. వరుస హిట్‌లతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన ఈ భామకు, గత కొంతకాలంగా తెలుగులో అదృష్టం కలిసి రావడం లేదు. ముఖ్యంగా మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా నుండి అనుహ్యంగా తప్పుకోవాల్సి రావడం పూజా కెరీర్‌పై ప్రభావం చూపింది. అయితే, ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ బాక్సాఫీస్‌పై కన్నేసిన ఈ బ్యూటీ, ఒక క్రేజీ ప్రాజెక్ట్‌తో తిరిగి రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

తమన్నా స్థానంలో పూజా?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న భారీ చిత్రం ‘ది పారడైజ్’. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. మొదట ఈ పాట కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను అనుకున్నప్పటికీ, ఇప్పుడు ఆ ఛాన్స్ పూజా హెగ్డే తలుపు తట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

ఐటమ్ సాంగ్ అయినా ‘తగ్గేదే లే’
ఇటీవల తమిళ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో మెప్పించిన పూజా, ఇప్పుడు తెలుగులో కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. కెరీర్ మళ్ళీ పుంజుకోవాలంటే ఇలాంటి మాస్ సాంగ్స్ మంచి బూస్ట్‌నిస్తాయని ఆమె భావిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. నాని లాంటి డైనమిక్ హీరోతో పూజా వేసే స్టెప్పులు థియేటర్లలో మంట పుట్టించడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

తమిళంలో ఫుల్ బిజీ.. తెలుగులో వెయిటింగ్
తెలుగులో గ్యాప్ వచ్చినప్పటికీ, కోలీవుడ్‌లో పూజా హెగ్డే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అక్కడ వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూనే, తన సొంత గడ్డ లాంటి టాలీవుడ్‌లో మళ్ళీ పాగా వేయాలని చూస్తోంది. నాని సినిమాలోని ఈ ప్రత్యేక గీతం పూజా కెరీర్‌కు మళ్ళీ పూర్వ వైభవం తెస్తుందో లేదో చూడాలి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Related News

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×