E-Paper
Advertisement

Poonam Bajwa: అమ్మాయిలతో బీ కేర్‌ఫుల్.. యువతకి పూనం హెచ్చరిక.. జాగ్రత్త పడాలంటూ!

Poonam Bajwa: అమ్మాయిలతో బీ కేర్‌ఫుల్.. యువతకి పూనం హెచ్చరిక.. జాగ్రత్త పడాలంటూ!
Advertisement

Poonam Bajwa:టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పూనం బజ్వా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వెండితెరపై ‘పరుగు’, ‘బాస్’ వంటి సినిమాలతో మెప్పించిన ఈ భామ, తాజాగా యువతకు ఒక అదిరిపోయే వార్నింగ్ ఇచ్చింది. “అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి.. వారు ఏ విషయాన్ని అంత త్వరగా మర్చిపోరు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దాదాపు 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న పూనం, తన గ్లామర్ ఫోటోలతోనే కాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అమ్మాయిలు మహారాణులు:

పూనం బజ్వా ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మీ జీవితంలో స్నేహితురాలుగానో, ప్రేయసిగానో లేదా భార్యగానో ఉన్న మహిళ ఏ దేశానికి మహారాణి కాకపోయినా.. ఆమెను ఒక రాణిలాగే గౌరవించాలని సూచించారు. ఇక వారిలో ఉండే శక్తిని, వారు పంచే ప్రేమను అభినందించడం మగవారి బాధ్యత అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రతి అమ్మాయి తన భాగస్వామి నుండి ఆ మాత్రం గౌరవాన్ని ఆశిస్తుందని పూనం తన మనసులోని మాటను బయటపెట్టారు.

మర్చిపోవడం వారి డిక్షనరీలోనే లేదు:

Advertisement

అమ్మాయిల జ్ఞాపకశక్తి గురించి పూనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా యువత ఏదైనా తప్పు చేసి “అన్నీ మర్చిపోదాం” అని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎందుకంటే మహిళలు ఏ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టరట.ఇక ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చే ఇతర అమ్మాయిల గురించి లేదా గతానికి సంబంధించిన విషయాల గురించి మహిళలు అస్సలు మర్చిపోరని, అందుకే వారితో ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా, నిజాయితీగా ఉండాలని ఆమె చమత్కరించారు.

గ్లామర్ నుండి గైడెన్స్ వరకు:

2005లో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పూనం బాజ్వా, హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ‘తేనావట్టు’, ‘కచేరి ఆరంభం’ వంటి సినిమాలతో అలరించారు. అయితే కథానాయకిగా ఆశించిన స్థాయికి చేరుకోకపోయినా, ఐటమ్ సాంగ్స్‌లో తన అందాల ఆరబోతతో కుర్రకారును ఉర్రూతలూగించారు. ఇక ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలతో 40 లక్షల మంది ఫాలోవర్స్‌ను అలరిస్తూనే ఉన్నారు.

Advertisement

also read:Dhurandhar 2: ధురంధర్ 2కి భారీ షాక్.. అప్పుడే టీవీల్లోకి!

వైరల్ అవుతున్న పూనం మాటలు:

పూనం బజ్వా కేవలం అందగత్తె మాత్రమే కాదు, లోకజ్ఞానం ఉన్న అమ్మాయి అని ఈ వ్యాఖ్యలతో ప్రూవ్ అయింది. మహిళల మనస్తత్వం గురించి ఆమె చెప్పిన విషయాలకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “నిజమే పూనం గారు.. అమ్మాయిలు పాత విషయాలను అసలు వదలరు” అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు ఆమె గ్లామర్‌ను పొగుడుతున్నారు. ఇక మొత్తానికి సినిమాలకు దూరంగా ఉన్నా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లతో పూనం బజ్వా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×