The Raja Saab Pre release: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరస సినిమాలలో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈయన ది రాజా సాబ్(The Raja Saab) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్ లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ కూడా హాజరు కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రభాస్ న్యూ లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ భాగంగా యాంకర్ సుమ ప్రభాస్ ను కొన్ని ప్రశ్నలు వేశారు.
ఈ నేపథ్యంలోనే పెళ్లి గురించి కూడా ప్రస్తావనకొచ్చింది. కొంతమంది అభిమానులు ప్రభాస్ ను పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటూ ఒక ప్ల కార్డు పట్టుకున్నారు. ఇదే విషయం గురించి సుమ ప్రశ్నించడంతో ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా ఒక క్వాలిటీ చెప్పండి అంటూ అడగడంతో ఆ క్వాలిటీ ఏదో తెలియకనే ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉన్నాను అంటూ ఈయన సమాధానం ఇచ్చారు. ఇలా పెళ్లి గురించి ప్రభాస్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ పెళ్లి గురించి తరచూ ప్రస్తావనకు వస్తూనే ఉంది . ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయిన ప్రభాస్ పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పండి నేపథ్యంలో అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలో తెలియకే ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదు అంటూ సమాధానం చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుమ కొంతమంది డైరెక్టర్లు పేర్లు చెప్పి వారి గురించి ఒక లైన్ లో సమాధానం చెప్పమని కోరారు. కల్కి డైరెక్టర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ స్ట్రాంగ్ అని తెలిపారు. ప్రశాంత్ నీల్: బ్యూటిఫుల్ పర్సన్, రాజమౌళి: జీనియస్ గారు, మారుతి: క్యూట్, హను రాఘవపూడి: హార్డ్ వర్కింగ్, సుజిత్: స్మార్ట్, సందీప్ రెడ్డి: కల్ట్ డైరెక్టర్ అంటూ ఒక్కో డైరెక్టర్ గురించి ఒక్కమాటలో ప్రభాస్ చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ప్రభాస్ లుక్ విషయానికి వస్తే అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది .అయితే స్పిరిట్ సినిమా షూటింగ్ నుంచి తాను ఇక్కడికి నేరుగా వచ్చానని ప్రభాస్ చెప్పడంతో కచ్చితంగా ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ఇదే లుక్ లో కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీ విడుదల కానుంది . మారుతీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా హర్రర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.