E-Paper
Advertisement

Prabhas Sister: సెట్లో అందరి ముందు అలాంటి పని చేసిన ప్రభాస్ సోదరి.. షాక్ లో ఇండస్ట్రీ!

Prabhas Sister: సెట్లో అందరి ముందు అలాంటి పని చేసిన ప్రభాస్ సోదరి.. షాక్ లో ఇండస్ట్రీ!
Advertisement

Prabhas Sister: స్టార్ ఇమేజ్ ఉన్నా, కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా కొందరిలో ఉండే సింపుల్ నెస్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ కుటుంబం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ సోదరి ప్రసీద ఉప్పలపాటి, ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ.. సెట్‌లో తన పని తాను చేసుకుపోతున్న తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫైటర్ రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ , అలాగే ఆయన సోదరి సింప్లిసిటీ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి:

రెబల్ స్టార్ ప్రభాస్ సోదరి గురించి ఫైటర్ రామకృష్ణ చెబుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆమె ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పటికీ, సెట్‌లో ఎక్కడా స్టార్ ఫ్యామిలీ గర్వం చూపించరట. ‘ఆమె తన పనిలో ఎంత నిమగ్నమైపోతుందంటే.. అవసరమైతే చేత్తో చీపురు పట్టుకుని సెట్‌ను కూడా క్లీన్ చేస్తుంది. అంతటి సింప్లిసిటీ ఆమె సొంతం’ అని రామకృష్ణ తెలిపారు. తన సోదరి కావడంతో ప్రభాస్ ఆమెను ప్రత్యేకంగా చూడమని చెప్పకుండా, ఆమె కష్టపడే తత్వాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారట. ఒక స్టార్ హీరో చెల్లెలు అయ్యుండి కూడా ఇంత సామాన్యంగా ఉండటం నిజంగా గ్రేట్ అని అందరూ కొనియాడక తప్పదు.

ఆ ఫైట్ సీన్ నచ్చి.. ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ :

Advertisement

ప్రభాస్ మనసు వెన్న అని అందరికీ తెలిసిందే, దానికి రామకృష్ణ చెప్పిన ఈ ఉదాహరణే నిదర్శనం. షూటింగ్ సమయంలో ప్రభాస్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘ఒక ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు నేను చేసిన మూమెంట్స్ ప్రభాస్‌కు బాగా నచ్చాయి. వెంటనే ఆనందంతో తన జేబులో నుంచి రూ. 10,000 తీసి నాకు బహుమతిగా ఇచ్చాడు. స్టార్ హీరో అయినా నన్ను ఎంతో ఎంకరేజ్ చేశాడు’ అని రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. తన పనిని గుర్తించి అలా ప్రోత్సహించడంతో ప్రభాస్‌పై తనకున్న గౌరవం వెయ్యి రెట్లు పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.

మొత్తానికి ప్రభాస్ కుటుంబం అంటే కేవలం సినిమాలకే పరిమితం కాదు, వారి వ్యక్తిత్వం కూడా ఎంతో ఉన్నతమైనదని ఈ విషయాలు నిరూపిస్తున్నాయి. అటు సోదరి కష్టపడే తత్వం, ఇటు కింది స్థాయి కార్మికులను సైతం అక్కున చేర్చుకునే ప్రభాస్ మనస్తత్వం చూస్తుంటే ‘డార్లింగ్’ అనే పేరు ఆయనకు ఊరికే రాలేదని అర్థమవుతుంది. స్టార్ హోదా తలకెక్కించుకోకుండా పనికి ప్రాధాన్యతనిచ్చే ఇలాంటి మనుషులు ఉండబట్టే ఆ కుటుంబానికి ఇంతటి క్రేజ్ ఉంది. ప్రభాస్ సోదరి సింప్లిసిటీ ఇప్పుడు చాలా మందికి స్ఫూర్తినిస్తోంది.

Advertisement

ALSO READ:Kalyani Priyadarshan: ‘కొత్తలోక’ సీక్వెల్ పై కళ్యాణి క్లారిటీ.. షూటింగ్ అప్పుడే అంటూ!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×