E-Paper
Advertisement

Spirit First Look: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ…స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Spirit First Look: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ…స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement

Spirit First Look: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన  టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో అర్జున్ రెడ్డి యానిమల్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో స్పిరిట్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం స్పిరిట్(Spirit) రెగ్యులర్ షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.

2027 సంక్రాంతి రిలీజ్?

ఈ సినిమాని 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సందీప్ రెడ్డి (Sandeep Reddy)ప్రణాళికలు రచించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పిరిట్ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. మరొక రెండు రోజులలో 2026 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో జనవరి 1వ తేదీని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

న్యూ ఇయర్ స్పెషల్.. ఫస్ట్ లుక్ రిలీజ్?

Advertisement

ఈ విధంగా స్పిరిట్ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే వార్త తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గాను అలాగే ఖైదీగా కూడా కనిపించబోతున్నట్టు ఇటీవల విడుదల చేసిన ఒక ఆడియో టీజర్ ద్వారా స్పష్టమైనది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కు సంబంధించి ఎలాంటి లీక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల ప్రభాస్ రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పిలకతో హాజరైన సంగతి తెలిసిందే.

పిలకతో దర్శనమిచ్చిన ప్రభాస్..

Advertisement

ఇలా పిలక కట్టుకొని సరికొత్త లుక్ లో కనిపించడంతో బహుశా ఇదే లుక్ లో స్పిరిట్ సినిమాలో కనిపించబోతున్నారా అంటూ అభిమానులు కూడా సందేహాలను వ్యక్తం చేశారు. ఇక ప్రభాస్ పాత్రకు సంబంధించిన పస్ట్ లుక్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరొక రెండు రోజులు ఎదురు చూడాల్సిందే. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని టి సిరీస్ బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులోనే షూటింగ్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది.

Also Read: Jagapathi Babu: పెద్ది సినిమాలో మరో స్టార్.. అప్పల సూరిగా జగ్గు భాయ్

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×