Vijay Thalapathy: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) తన చివరి సినిమాగా హెచ్.వినోత్ (H. Vinoth ) దర్శకత్వంలో జననాయగన్ (Jana Nayagan).చిత్రాన్ని తెరకెక్కించారు . ఈ చిత్రాన్ని తెలుగులో ‘జననాయకుడు’ హిందీలో ‘జననేత’ అంటూ డబ్బింగ్ వెర్షన్లలో ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రానికి సెన్సార్ లభించడంలో జాప్యం ఏర్పడింది.
సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వకపోవడంతో మద్రాసు సింగిల్ బెంచ్ కోర్టును ఆశ్రయించారు చిత్ర బృందం. అయితే విచారణ జరిపిన తర్వాత సింగిల్ బెంచ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని జారీ చేసింది. అయితే సింగిల్ బెంచ్ తీర్మానాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ లో కేసు వేశారు సెన్సార్ సభ్యులు. అయితే ఇక్కడ కూడా జన నాయగన్ చిత్రానికి అనుకూలంగా తీర్పు వెలువడలేదు దీంతో ఈ చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ కేసును తీసుకోలేమని చెప్పి తిరిగి మద్రాసు డివిజన్ బెంచ్ ని ఆశ్రయించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇకపోతే ఇక విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన యూ/ఏ సర్టిఫికెట్ ఉత్తర్వులను రద్దు చేస్తూ సినిమాను 9 మంది సభ్యుల రివైజింగ్ కమిటీకి పంపాలని స్పష్టం చేసింది.
అంతా అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి సెన్సార్ రావడంలో మళ్లీ జాప్యం ఏర్పడడంతో మార్చి 19వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. పైగా ఇదే రోజున యష్ ‘టాక్సిక్’ సినిమా కూడా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాకి సెన్సార్ వస్తుందా? లేదా? అన్న విషయం ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు విజయ దళపతి టీవీకే పార్టీ స్థాపించి వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది రాజకీయ శక్తులు ఈ సినిమాను ఆపే ప్రయత్నం చేస్తున్నాయంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ALSO READ:Ranveer Singh: హీరో రణ్ వీర్ సింగ్ పై కేస్ ఫైల్.. అసలేం జరిగిందంటే?
ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై విజయ్ దళపతి తండ్రి , నిర్మాత ఎస్.ఏ.చంద్రశేఖర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా చెన్నైలో జరిగిన ఒక ఫంక్షన్ లో పాల్గొన్న చంద్రశేఖర్ విజయ్ గురించి మాట్లాడుతూ.. “విజయ్ కేవలం సినిమాలకే పరిమితమై ఉంటే.. ఈపాటికి ఇంకా చాలా డబ్బు సంపాదించేవాడు. మా అబ్బాయి డబ్బును మాత్రమే నమ్మే వ్యక్తి కాదు. సులభంగా సినిమాలు చేసి కోట్లు సంపాదించగలడు. అయితే వాటన్నింటినీ వదులుకొని తమిళనాడు ప్రజలకు సేవ చేయాలనేదే అతని మనసులో ఉన్న ఏకైక కోరిక. అందుకే రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లో ఇలాంటి అడ్డంకులు సహజం. విజయ్ వేటికి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు. మద్రాస్ హైకోర్టు విజయ్ నటించిన జననాయగన్ సినిమా సెన్సార్ పై మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది. అయితే ఈ సినిమాను ఆపివేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వాటిని విజయ్ ఖచ్చితంగా తిప్పికొడతాడు. ఇకపోతే ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ విజయ్ రాజకీయ ప్రవేశం యువతలో మార్పు తెచ్చింది” అంటూ తెలిపారు విజయ్ తండ్రి చంద్రశేఖర్. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.