Rahul Dev : సిల్వర్ స్క్రీన్ పై విలన్ గా ఎంతో మంది హీరోలకి ముచ్చెమటలు పట్టించిన ఈ స్టార్ యాక్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతున్నాడు. ఎందుకో తెలుసా.. 57 ఏళ్ల వయసులో తనకన్నా 18 ఏళ్ల చిన్నదైన అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు మరి.అవును.. టాలీవుడ్ లో తనదైన స్టైలిష్ లుక్ తో విలనిజానికి కేరాఫ్ అయిన రాహుల్ దేవ్ ప్రేమాయణం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయిపోయింది.
2000లో ‘ఛాంపియన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ
రాహుల్ దేవ్.. ఈ పేరు వినిపించగానే మనకి ‘మాస్’, ‘ఆంధ్రవాలా’, ‘సింహాద్రి’, ‘మున్నా’, ‘జై చిరంజీవ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు గుర్తుకొస్తాయ్.డిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకుగా పుట్టిన రాహుల్ దేవ్ చిన్నప్పటి నుండే నటనపై ఇష్టం పెంచేసుకున్నాడు. అలా తొలిసారి సన్నీ డియోల్ హీరోగా నటించిన 2000లో ‘ఛాంపియన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.ఇక మొదటి సినిమాలోనే భయంకరమైన విలన్‌గా నటించి ‘ఫిల్మ్ ఫేర్ ఉత్తమ విలన్’ అవార్డుకు నామినేట్ అవడం విశేషం.
9 భాషల్లో 100కు పైగా చిత్రాల్లో
అలా తెలుగు, హిందీ మాత్రమే కాకుండా.. తమిళం, కన్నడ, మలయాళం, భోజ్‌పురి మరియు పంజాబీ వంటి దాదాపు 9 భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించాడంటే కెరీర్ ని ఎంత సక్సెస్ ఫుల్ గా సాగించాడో అర్థమవుతుంది.ఇక ఈయన తమ్ముడు ముకుల్ దేవ్ కూడా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన వాడే. అయితే ఈ మధ్యే ముకుల్ దేవ్ అనారోగ్య కారణాలతో చనిపోవడం మనకి తెల్సిందే. ఇక సినిమాల్లో బిజీగా ఉన్న 2009 సమయంలో ఆయన భార్య రీనా దేవ్ క్యాన్సర్‌తో చనిపోవడం రాహుల్ జీవితంలో అతి పెద్ద విషాదం.ఇక భార్య చనిపోవడంతో నిరాశలో కూరుకుపోయిన రాహుల్ దేవ్ కొన్నాళ్ళ పాటు సినిమాలకి దూరంగా ఉండిపోయాడు. భార్య మరణంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు బాధ్యతలను ఒక తండ్రిగా సమర్థవంతంగా నెరవేర్చాడు రాహుల్.
18 ఏళ్ల చిన్నదానితో ప్రేమాయణం.. ఎవరీ ముగ్ధా గోడ్సే?
ముగ్ధా గోడ్సే విషయానికి వస్తే.. మిస్ ఇండియా 2004 పోటీల్లో సెమీ ఫైనలిస్ట్ వరకు వెళ్లిన ఈ అమ్మడు ‘మిస్ పర్ఫెక్ట్ బాడీ’ టైటిల్ గెలుచుకోవడం విశేషం.మోడలింగ్‌లో టాప్ సెలబ్రిటీగా ఉన్న సమయంలోనే మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఫ్యాషన్’ (2008) తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముగ్ధా.ఇక తొలిసినిమాతోనే బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా ఫిలిమ్ ఫేర్ కి నామినేట్ అయ్యింది.ఆ తర్వాత ‘ఆల్ ది బెస్ట్’, ‘జైల్’, ‘హీరోయిన్’ వంటి సినిమాలలో మంచి రోల్స్ చేసింది.
రాహుల్ దేవ్, ముగ్ధాల జోడీ
ఇక రాహుల్ దేవ్, ముగ్ధా ల జోడీ విషయానికి వస్తే 2013లో ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో వీరిద్దరికీ పరిచయం అయింది.రాహుల్ వైఫ్ చనిపోవడంతో ఒక మంచి ఫ్రెండ్ గా సపోర్టివ్ గా ఉన్న ముగ్ధా, తర్వాతి కాలంలో ప్రేమికురాలిగా మారింది.ఇద్దరి మధ్య 18 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ యోగా, ఏరోబిక్స్, ముఖ్యంగా ఈశా ఫౌండేషన్ పట్ల ఇద్దరికీ ఉన్న ఆసక్తి వీరిని దగ్గర చేసిందని తెలుస్తుంది.ఇక చాలా సార్లు “ప్రేమకి వయసుతో సంబంధం లేదు, మనసులు కలిస్తే చాలు” అంటూ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ పై వచ్చే ట్రోల్స్ కి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు ఈ స్టైలిష్ విలన్.
ఏది ఏమైనా 57 ఏళ్ల వయసులోనూ సాలిడ్ ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తున్న రాహుల్ దేవ్ కుర్రకారుకి గట్టి పోటీ ఇస్తున్నాడనే చెప్పాలి.చూడాలి మరి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న రాహుల్ దేవ్, ముగ్ధా గోడ్సే జోడీ ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతుందో!
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==