E-Paper
Advertisement

Raju Weds Rambai : చిన్న సినిమా సెన్సేషనల్ గ్రాస్, దర్శక నిర్మాతల ఆలోచన మారాలి

Raju Weds Rambai : చిన్న సినిమా సెన్సేషనల్ గ్రాస్, దర్శక నిర్మాతల ఆలోచన మారాలి
Advertisement

Raju Weds Rambai : ఈ రోజుల్లో ఒక సినిమాను తీయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లడం కూడా అంతే ముఖ్యం. అయితే కొన్ని కథలు వింటేనే ఏదోలా అనిపిస్తాయి. అలాంటి కథలను స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో గట్టిగా వినిపించిన సినిమా పేరు రాజు వెడ్స్ రాంబాయి.

ఈ సినిమా కొన్ని యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని చేశారు. అయితే ఈ కథను బయటకు రాకుండా ఒక 15 సంవత్సరాలు పాటు దాచారు. మొత్తానికి దర్శకుడు ఈ కథను చెప్పాలి అనుకున్న టైంలో చాలా ఇబ్బందులు తనకు ఎదురయ్యాయి. ఈ సినిమాను చాలామందికి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఎవరూ కూడా ఈ కథను ఎంకరేజ్ చేయలేదు. ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా క్లైమాక్స్ మార్చమని చెప్పాయి. దర్శకుడు మాత్రం ఎటువంటి మార్పులు చేయకుండా సినిమాను తెరకెక్కించాడు.

సెన్సేషనల్ గ్రాస్ 

Advertisement

ఈ సినిమాకి సంబంధించి అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. దాదాపు 15 కోట్లకు పైగా ఈ సినిమాకి గ్రాస్ వచ్చింది. అయితే ఈ సినిమాకి ఈ స్థాయి కలెక్షన్స్ వస్తాయని బహుశా చిత్ర యూనిట్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. సినిమా బాగుంటుంది మంచి సినిమాను ఎంకరేజ్ చేస్తారు అని అందరూ ఊహించారు కానీ ఈ స్థాయి కమర్షియల్ సక్సెస్ సాధిస్తుంది అని అంచనా వేయలేకపోయారు.

 

Advertisement

విరాటపర్వం సినిమాతో మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్నారు వేణు. కానీ ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. కానీ ఈ సినిమా విషయంలో ఒక నిర్మాతగా కొంతమేరకు వేణుకు ప్లస్ అయింది అని చెప్పాలి. సినిమాకి ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం రెండవ వారంలోకి ఎంటర్ అయిపోయింది. రెండవ వారంలోకి ఈ సినిమా ఎంటర్ అయిన కూడా అద్భుతమైన ఆదరణ ఈ సినిమాకు లభిస్తుంది.

దర్శక నిర్మాతల ఆలోచన తీరు మారాలి 

ఈ కథకు చాలా రిజెక్షన్స్ ఇండస్ట్రీలో వచ్చాయి. రోషన్ కనకల, విరాట్ కర్ణ, సుమంత్ ప్రభాస్ వంటి హీరోలు ఈ కథను ఆల్రెడీ రిజెక్ట్ చేశారు. మరోవైపు చాయ్ బిస్కెట్ అనురాగ్ రెడ్డి కూడా ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ మార్చమని దర్శకుడు సాయిలు చెప్పారు. తను మార్చలేదు.

మొత్తానికి ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది కాబట్టి ఒక కథను చెబుతున్నప్పుడే చాలామంది దర్శక నిర్మాతలు సినిమా ఎలా ఉండబోతుంది అని అంచనా వేస్తే అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు. ఆ అంచనా వేయలేనప్పుడు సినిమా సక్సెస్ అయిన తర్వాత బాధపడాల్సిన పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. దర్శక నిర్మాతల ఆలోచన తీరు ఇటువంటి కథలు విషయంలో కొంచెం మార్చుకోవాలి అని చెప్పాలి.

Also Read : GV Prakash : అలవైకుంఠపురం రేంజ్ లో సూర్య వెంకీ అట్లూరి సినిమా, అవార్డ్స్ అన్ని ఆ సినిమాకు

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×