E-Paper
Advertisement

Peddi Movie: ‘ధురంధర్’ సెన్సేషన్ తర్వాత.. ‘పెద్ది’ కోసం జియో స్టూడియోస్ భారీ డీల్!

Peddi Movie: ‘ధురంధర్’ సెన్సేషన్ తర్వాత.. ‘పెద్ది’ కోసం జియో స్టూడియోస్ భారీ డీల్!
Advertisement

Peddi Movie: భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ధురంధర్’ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించే చర్చ జరుగుతోంది. రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా సాధించిన అసాధారణ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ పెద్ది పై కన్నేసింది. ఈ సినియాను నార్త్ ఇండియాలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంది.

Read also-Sharwanand: జీవితంలో ఆ ముగ్గురిని ఎప్పటికీ మర్చిపోవద్దు -హీరో శర్వానంద్

భారీ ధరకు హక్కులు

Advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నార్త్ ఇండియా పంపిణీ హక్కులను జియో స్టూడియోస్ భారీ ధరకు దక్కించుకుంది. ‘ధురందర్’ లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత వారు పంపిణీ చేస్తున్న సినిమా కావడంతో, హిందీ బెల్ట్‌లో ‘పెద్ది’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రామ్ చరణ్‌కు ‘RRR’ తర్వాత ఉన్న పాన్-ఇండియా క్రేజ్ దృష్ట్యా, ఈ డీల్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

1980ల నాటి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంతో సాగే ఈ కథలో రామ్ చరణ్ ఒక పల్లెటూరి యువకుడిగా కనిపిస్తారని తెలుస్తోంది. క్రీడల నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ జర్నీ కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకోవడమే కాకుండా, ఉత్తరాంధ్ర యాసలో డైలాగులు కూడా చెప్పబోతున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ వంటి పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వృద్ధి సినిమాస్ మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Read als0-Samantha: దాన్ని అనుభవించే హక్కు మీకుంది.. మరోసారి మహిళా హక్కులపై సమంత పోరాటం!

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్లకుంటుంది. జియో స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థ ‘పెద్ది’ వెనుక నిలబడటంతో, ఈ సినిమా నార్త్ ఇండియాలో కూడా ‘పుష్ప’, ‘RRR’ తరహాలో భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ధురందర్’ ఇచ్చిన ఊపుతో జియో స్టూడియోస్ చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×