E-Paper
Advertisement

రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి మరో బిగ్ అప్డేట్.. స్పెషల్ సాంగ్ వెన్యూ ఫిక్స్..

రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి మరో బిగ్ అప్డేట్.. స్పెషల్ సాంగ్ వెన్యూ ఫిక్స్..
Advertisement

Peddi Updates: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ టాలీవుడ్ మూవీ ‘పెద్ది’. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచనాలను మూటగట్టుకున్న ఈ సినిమా, తాజాగా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రామ్ చరణ్ సరికొత్త మాస్ అవతారంలో కనిపించనున్న ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచడంతో మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

Read also-టాలీవుడ్‌ సంక్షోభంపై బన్నీ వాస్ సంచలన ట్వీట్.. వందల కోట్ల కలెక్షన్లు నిజం కాదా?

ముంబై వేదికగా ‘పెద్ది’ ట్రైలర్..

Advertisement

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్, తాజాగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న లొకేషన్ (వెన్యూ)ను కూడా అధికారికంగా ప్రకటించారు. మే 18, 2026న దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదికగా ‘పెద్ది’ అఫీషియల్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక ప్రకటన చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో నార్త్ బెల్ట్‌లో రామ్ చరణ్‌కు వచ్చిన విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ పాన్-ఇండియా ప్రమోషన్స్‌ను ముంబై నుండి భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సెర్ట్!

ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చిన కాసేపటికే చిత్ర యూనిట్ అభిమానులకు మరో ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్‌ను మే 23న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో లాంచ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్‌లో స్వయంగా ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. “SoundOfPeddi will echo in BHOPAL from May 23rd.. Get ready for vibe of the special song and Watch A R Rahman sir perform live” అంటూ మూవీ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మ్యూజికల్ ఫీస్ట్ కోసం కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, మ్యూజిక్ లవర్స్ అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Read also-కోరిక తీరింది.. కానీ ప్రాణం పోయింది! హారర్ థ్రిల్లర్ లవర్స్ అవ్వొద్దు..

జూన్ 4న గ్రాండ్ రిలీజ్

ఈ డబుల్ ధమాకా అప్‌డేట్స్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. జూన్ 4, 2026న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. బుచ్చిబాబు సనా మార్క్ ఎమోషన్స్, రామ్ చరణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్.. ఇవన్నీ కలిసి ఈ సినిమాను ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేలా చేస్తాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మే 18 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రమోషనల్ జాతర థియేటర్లలో ఏ స్థాయి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×