E-Paper
Advertisement

వందకోట్ల క్లబ్ లో చరణ్.. పెద్ది కోసం భారీ రెమ్యూనరేషన్ ..కెరీర్ లోనే హైయెస్ట్!

వందకోట్ల క్లబ్ లో చరణ్.. పెద్ది కోసం భారీ రెమ్యూనరేషన్ ..కెరీర్ లోనే హైయెస్ట్!
Advertisement

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా(Peddi Movie) పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో కేవలం ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉందని ఈ సాంగ్ పూర్తి అయితే షూటింగ్ మొత్తం పూర్తయినట్లేనని తెలుస్తోంది. ఇక మంచి క్వాలిటీ కంటెంట్ ఉన్న సినిమాని ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతో ఈ సినిమాని ఏప్రిల్ 30వ తేదీ నుంచి జూన్ నెలకి వాయిదా వేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరి కాస్త సమయం అవసరమైన నేపథ్యంలోనే చివరి నిమిషంలో ఈ సినిమా విడుదలడు వాయిదా వేశారు.

100 కోట్ల క్లబ్ లోకి చరణ్..

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా ద్వారా గ్లోబల్ రేంజ్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ తన తదుపరి సినిమాలన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక త్వరలోనే పెద్ది సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం రామ్ చరణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి హీరోలందరూ కూడా 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

పెద్ది కోసం 120 కోట్ల రెమ్యూనరేషన్..

Advertisement

ఇకపోతే తాజాగా రాంచరణ్ సైతం రెమ్యూనరేషన్ విషయంలో 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టారని తెలుస్తోంది. పెద్ది సినిమా కోసం రాంచరణ్ ఏకంగా 120 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు చరణ్ కెరియర్లో ఇది హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది. ఈ సినిమాకు 120 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ సైతం 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టారని చెప్పాలి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకుంటే కనుక సుకుమార్ డైరెక్షన్లో చేయబోయే సినిమాకు ఈయన రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

స్పెషల్ సాంగ్ లో సంయుక్త మీనన్..

Advertisement

ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నప్పటికి స్పెషల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ ఇప్పటివరకు ఎంపిక కాని నేపథ్యంలో ఆలస్యమవుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా స్పెషల్ స్టెప్పులు వేయడం కోసం ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదని సమాచారం అయితే తెరపైకి ఎంతో మంది హీరోయిన్ల పేర్లు వినబడుతున్న సంగతి తెలిసిందే. ఈ పాట కోసం మృణాళ్ ఠాకూర్, మానస వారణాసి వంటి హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు సంయుక్త మీనన్ పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం ఈ విషయంపై ఎక్కడా స్పందించలేదు.

Also Read: పవన్ కళ్యాణ్ రాజకీయాల పై తమన్నా సింహాద్రి కామెంట్స్.. పొలిటిక జోకర్ అయ్యారంటూ!

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×