E-Paper
Advertisement

Dhurandhar film: ధురంధర్ నుంచీ తెలుగు సాంగ్ రిలీజ్.. “ఒక తీరమే” అంటూ!

Dhurandhar film: ధురంధర్ నుంచీ తెలుగు సాంగ్ రిలీజ్.. “ఒక తీరమే” అంటూ!
Advertisement

Dhurandhar film:ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా.. సారా అర్జున్ (Sara Arjun) హీరోయిన్ గా తొలి పరిచయంలో వచ్చిన చిత్రం ధురంధర్..ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు గత ఏడాది డిసెంబర్ 5న వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తూ ఏకంగా రూ.1400 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. హిందీలో విడుదలైన ఈ సినిమా అటు పాకిస్తాన్ లో కూడా ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 11 దేశాలలో అగ్ర స్థానంలో నిలిచి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఈ సినిమా. ఇకపోతే అటు ఓటీటీలోకి వచ్చి.. అక్కడ కూడా రికార్డులు తిరగరాస్తోంది. ఇకపోతే ఆదిత్యధర్ దర్శకనిర్మాణంలో వచ్చిన ఈ సినిమా మార్చి 19వ తేదీన ‘ధురంధర్ 2:ది రివేంజ్’ పేరిట థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ధురంధర్ నుండి తెలుగు సాంగ్ రిలీజ్..

ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా మొదటి పార్ట్ నుండి హీరో పాకిస్తాన్ లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే తెలుగు వర్షన్.. “మండు వేసవే..గాజు ముక్కలా.. నన్ను కోసినా.. అడుగేస్తూనే పోతా.. ఒక తీరమే” అంటూ సాగే గీతాన్ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. కృష్ణకాంత్ ఈ పాటకు సాహిత్యం అందించగా.. శాశ్వత్ సచ్ దేవ్ సంగీతంలో హరి చరణ్ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో వైరల్ అవుతోంది. మొత్తానికి అయితే హుషారెత్తించేలా ఉన్న ఈ పాట అటు యూట్యూబ్లో ప్రేక్షకులను అలరిస్తోంది.

Advertisement

also read:Toxic Teaser: టాక్సిక్ టీజర్ రిలీజ్.. యశ్ పై భారీ ట్రోల్స్!

ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్..

ఇదిలా ఉండగా మొదటి భాగం క్రియేట్ చేస్తున్న రికార్డులతో రెండవ భాగంపై ఊహించని ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ భాగం అంతకుమించి ఉండాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ రోజునే అటు గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది . పూర్తి వైలెన్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఒకేరోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పదనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఏ మాత్రం ఈ సినిమా కాస్త తడబడినా సరే టాక్సిక్ దెబ్బకు తట్టుకోవడం కష్టమే అనే కామెంట్లు కూడా సినీ విశ్లేషకులు నుండి వ్యక్తమౌతూ ఉండడం గమనార్హం. మరి ఎంతో పగడ్బందీగా ఈ సినిమాను ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా..అటు టాక్సిక్ భయం ధురంధర్ అభిమానులను చుట్టుకుందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అయితే దురంధర్ 2 పై నెలకొన్న ఆసక్తి, అంచనాలను ఆదిత్య అందుకొని మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తారేమో చూడాలి.

Advertisement

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×