Renudesai:సామాజిక మాధ్యమాల వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఫేమస్ అయిపోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొంతమంది తమ టాలెంట్ ను ఉపయోగిస్తే.. మరి కొంతమంది సెలబ్రిటీలను టార్గెట్గా చేసుకొని బూతులు తిడుతూ ఫేమస్ అయిపోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే అటు మానసికంగా సెలబ్రిటీలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని గ్రహించలేక ఆఖరికి చిక్కుల్లో పడుతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ , ఫ్యాషన్ డిజైనర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆమె మాత్రమే కాదు ఆమె పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తూ కొంత మంది దారుణంగా బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. సుప్రీంకోర్టు వీధి కుక్కలపై ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని రేణు దేశాయ్ చేసిన కామెంట్లే ఆమె పాలిట శాపంగా మారాయి. కుక్కలు అన్నీ చెడ్డవి కాదు అని, ఒకవేళ చెడువి అయితే తమ సంస్థకు చెబితే తాము వాటిని పట్టుకెళ్తామని ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించింది. అయితే కొంతమంది అత్యంత దారుణంగా మాట్లాడుతూ.. ఆ వీధి కుక్కలు రేణు దేశాయ్ ను, ఆమె పిల్లల్ని కొరకాలని, ప్రైవేట్ పార్ట్ లను కొరకాలి అంటూ చాలా దారుణంగా నీచాతి నీచంగా కామెంట్లు చేశారు. దీంతో మానసికంగా దిగ్భ్రాంతికి లోనైన రేణు దేశాయ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా 6 మందిని అరెస్టు చేశారు .
పైగా మరికొంతమందిని అరెస్టు చేసే పనిలో ఉన్నట్లు ఈ విషయాన్ని మళ్లీ స్వయంగా రేణు దేశాయ్ తెలుపుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది.” మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే మీ హెచ్ఆర్ కి కంప్లైంట్ చేస్తాను. మీరు చేసే ఈ అసభ్యకర కామెంట్ల వల్ల మీకు ఒక ఫ్యామిలీ ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారా? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరొకసారి తన ఆవేదనను బయటపెట్టింది రేణు దేశాయ్. తాను ఒక ఆర్టిస్టుని అని, టెర్రరిస్ట్ ని అయితే కాదు కదా అంటూ ప్రశ్నించింది.
also read:ఫ్యాన్స్ కి షాక్.. పెళ్లిపై శృతిహాసన్ కీలక నిర్ణయం!
ఈ నేపథ్యంలోనే మరొక వీడియోను తన ఇంస్టాగ్రామ్ వేదికగా విడుదల చేస్తూ..” అసలు మాపై ఎందుకు ఇంత అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు .మేము ఆర్టిస్టులం.. మా మనసు చాలా సున్నితంగా ఉంటుంది..మేము టెర్రరిస్టులం కాదు కదా.. ఎవరైనా క్రైమ్ చేస్తుంటే వాళ్ళని తిట్టండి . కానీ మాలాంటి ఆర్టిస్టులను మీరు తిట్టొద్దు.. ప్లీజ్. మేమేమి నేరాలు చేయట్లేదు కదా.. మీకు నా పని నచ్చకపోతే నన్ను ఫాలో చేయడం ఆపేయండి..నేనేం పాపం చేశాను.. ఇంత అసభ్యంగా తిడుతున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రేణు దేశాయ్. ఇక ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==