E-Paper
Advertisement

దిగొచ్చిన రవితేజ.. ఈ భారీ మార్పు వెనుక అసలు కారణం?

దిగొచ్చిన రవితేజ.. ఈ భారీ మార్పు వెనుక అసలు కారణం?
Advertisement

Raviteja:అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత సెకండ్ హీరోగా మారి, హీరోగా సినిమాలు చేసి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు రవితేజ. మాస్ మహారాజాగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న ఈయన.. ఇటీవల కాలంలో హీరోగా నటించడమే కాకుండా పలువురు స్టార్ హీరోల చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇకపోతే రవితేజ ఇతర హీరోల సినిమాలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారే కానీ సోలో పర్ఫామెన్స్ లో వెనుకబడిపోయారు అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలకాలంలో ఈయన నటించిన ప్రతి సినిమా కూడా వరుసగా పరాజయాల పాలవుతోంది. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద ఎదురుదెబ్బలు తగలడంతో తదుపరి సినిమాల విషయంలో రవితేజ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

రవితేజ కఠిన నిర్ణయం..

ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న రవితేజ.. ఇప్పుడు భారీగా దిగివచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం కూడా ఈ వరుస ఫ్లాప్స్ అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లు చవిచూస్తున్న నేపథ్యంలో తన రెమ్యూనరేషన్ విషయంలో గతంలో లాగా ఇప్పుడు మరింత కఠినంగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన పారితోషకాన్ని భారీగా తగ్గించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లందరూ కూడా స్టార్ హీరోలతో బిజీగా ఉండడంతో రవితేజ వైపు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం..

Advertisement

ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్లను నమ్ముకున్న రవితేజ తనకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని కేవలం రూ.15 కోట్లకు పారితోషకాన్ని పరిమితం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు 25 కోట్ల రూపాయలు తీసుకుంటూ దూసుకుపోయిన రవితేజ మళ్లీ తనకు భారీ విజయం దక్కేవరకు నిర్మాతలపై భారం పడకూడదు అనే ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ ఫిలిం నగర్ వర్గాలలో చర్చ జరుగుతోంది.. రవితేజ తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి.

also read:రాధిక కంటే మంచి యాక్టర్ నేనే.. షకీలా షాకింగ్ స్టేట్ మెంట్ !

రవితేజ ఆశలన్నీ ఇరుముడి పైనే..

Advertisement

ఇదిలా ఉండగా.. రవితేజ ఆశలన్నీ ‘ఇరుముడి’ చిత్రం పైనే ఉన్నాయి. కెరీయర్లో ఇప్పటివరకు టచ్ చేయని థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాకి దర్శకుడిగా శివ నిర్మాణ వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రవితేజ కెరియర్ మళ్ళీ గాడిన పడాలన్నా.. స్టార్ హీరోగా తన ఫామ్ ను తిరిగి నిలబెట్టుకోవాలన్నా సరే ఈ సినిమా విజయం రవితేజకు అత్యంత కీలకము. ఒకవేళ ఈ సినిమా గనుక ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తే మాత్రం మళ్లీ రవితేజ ఫామ్ లోకి వస్తారు. లేదంటే ఇక ఆయన కెరియర్ మరింత డీలా పడిపోతుందనడంలో సందేహం లేదు. అందుకే విభిన్న జానర్ ను ఎంచుకున్నారు రవితేజ. మరి ఈ జానర్ రవితేజకు ఎలాంటి సక్సెస్ను అందిస్తుందో చూడాలి.

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×