E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ , విజయ్ గెలుపుపై ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్!

పవన్ కళ్యాణ్ , విజయ్ గెలుపుపై ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్!
Advertisement

Film industry: మనం చేసే పని పట్ల కృషి, పట్టుదల, నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలం అని ఎంతోమంది తారలు నిరూపించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే రాజకీయాల్లోకి రావాలి అని, ప్రజలకు మేలు చేయాలి అని ఎంతో పరితపించి పోయిన విజయ్ దళపతి .. పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలోనే తమిళనాడుకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు పోటీ చేసిన మొదటిసారి ఏకంగా 108 సీట్లు కైవసం చేసుకొని తమిళనాట అతిపెద్ద పార్టీగా నిలిచింది టీవీకే. అటు తమిళనాడులో విజయ్ ఏ విధంగా అయితే ప్రజలకు మేలు చేయాలని తపన పడ్డారో.. ఇక ఈ తరం హీరోలలో పవన్ కళ్యాణ్ కూడా అదే రేంజ్ లో శ్రమించారు. పార్టీ పెట్టి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ తొలిసారి పోటీ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.అంతేకాదు కూటమి గెలుపులో ప్రధాన సూత్రధారిగా పేరుగాంచి ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు.. ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ విజయ్ దళపతి విజయాలపై ప్రముఖ సినీ నటుడు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆయన ఎవరో కాదు ఆర్ జే బాలాజీ.

విజయ్ విజయంపై ప్రముఖ దర్శకుడు కామెంట్..

ప్రముఖ సినీ నటుడు సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం వీరభద్రుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. మే 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాదులో సినిమా యూనిట్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న దర్శకుడు ఆర్జే బాలాజీ ఎన్నో విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సినిమా విశేషాలతో పాటు పవన్ కళ్యాణ్ సక్సెస్ కు కారణం ఏంటో కూడా తెలిపారు. ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు చాలామంది నమ్మలేదు. ఎగతాళి చేశారు .ఎన్నో రకాల దుష్ప్రచారాలు చేశారు . కానీ ఆయన తనపై తనకు ఉన్న నమ్మకాన్ని ఎక్కడా కోల్పోలేదు తన లక్ష్యం కోసం కల కోసం నిరంతరం శ్రమిస్తూనే వచ్చారు. దాని ఫలితంగానే ఈరోజు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగారు.

పవన్ కళ్యాణ్ ఒక శక్తిగా మారారు..

Advertisement

అటు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఎంతమంది విమర్శించినా తన నమ్మకాన్ని కోట్ల మంది ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అటు ప్రజలు కూడా ఆయనను నమ్మి ఓటేశారు. ముఖ్యంగా మన మీద మనకి నమ్మకం ఉంటే అది ఒక శక్తిగా మారుతుంది. అందుకే పవన్ కళ్యాణ్, విజయ్ కూడా తమ పొలిటికల్ ప్రయాణంపై గట్టిగా నిలబడ్డారు. కాబట్టే నేడు వారు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు అంటూ తెలిపారు బాలాజీ.

also read:విడాకుల దిశగా సెలబ్రిటీ జంట.. ఎవరు? అసలేం జరిగిందంటే?

వీరభద్రుడు అవకాశంపై క్లారిటీ..

Advertisement

ఇక తాను దర్శకత్వం వహిస్తున్న వీరభద్రుడు సినిమా గురించి మాట్లాడుతూ.. “నేను సూర్యతో ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఆయనను చాలామంది ప్రశ్నించారు. మణిరత్నం, సుధా కొంగర అలాంటి దర్శకులతో సినిమాలు చేసిన మీరు ఈయనకు అవకాశం ఇవ్వడమేంటి అని ఆయనను ప్రశ్నించారు. కానీ ఆయనకు నా మీద నమ్మకం క్లారిటీ ఉంది. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కుంగిపోకుండా ముందడుగు వేస్తే కచ్చితంగా విజయం లభిస్తుంది” అంటూ తన మాటల్లో చెప్పుకొచ్చారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×