Roshan Kanakala : ఈ రోజుల్లో ఒకరు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతే తర్వాత వాళ్ళ వంశాన్ని కూడా ఇన్వాల్వ్ చేయటం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సాధించుకున్నారు. ఆ తరువాత ఆ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్లకి వరుస డిజాస్టర్ సినిమాలు పడినా కూడా ఇప్పటికీ సర్వైవ్ అవుతున్నారు అంటే కొంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కలిసి వచ్చింది అని చెప్పాలి.
అలానే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అనేది కేవలం సినిమా ఓపెనింగ్స్ వరకు మాత్రమే పనికొస్తుంది. ఆ తర్వాత సినిమాలో ఎలా నటించాడు ఎటువంటి కథాంశాన్ని ఎంచుకున్నాడు అనే విషయాలు ప్రేక్షకులు ఎక్కువ పరిగణలోకి తీసుకుంటారు. ఈరోజు అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి హీరోలు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు అంటే కారణం వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ మరియు వాళ్ళు ఎంచుకున్న స్క్రిప్టులు అని చెప్పాలి.
ప్రముఖ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచాల అవసరం లేదు. తాను ఒక ఈవెంట్ పోస్ట్ చేశారు అంటే ఆమె ఎనర్జీతో ఆడిటోరియం అంతా నిండిపోతుంది. చాలా విషయాలను ఆమె యాంకరింగ్ తో కంట్రోల్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ట్రైలర్ లేట్ అయిన కూడా ఆవిడ మేనేజ్ చేస్తుంటారు. ఇకపోతే తన కొడుకు రోషన్ బబుల్గం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు.
ప్రస్తుతం మొగ్లీ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు రోషన్ కనకల. ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలవుతుంది అని అందరూ ఊహించరు. కానీ అఖండ సినిమా అదే డేటుకు వస్తుండడంతో ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయిపోయింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటకు చెప్పాడు రోషన్. రోషన్ మీద విపరీతమైన ప్రభావం చూపించిన సినిమా స్టూడెంట్ నెంబర్ వన్. వాళ్ళ ఇంట్లో ఆ సిడి ఉండేదట. రాజీవ్ కనకాల కూడా ఆ సినిమాలో నటించడంతో ఆ సిడి ఇంట్లో ఉంది అంటూ నవ్వుకుంటూ చెప్పాడు. మూడు నాలుగు సంవత్సరాలు ఏజ్ ఉన్నప్పుడే ఆ సినిమాను లెక్కలేనని సార్లు చూస్తూ ఉండేవాడట. అలా ఎన్టీఆర్ కు విపరీతమైన అభిమాని అయిపోయాడు.
అయితే ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చూసిన తర్వాత సింహాద్రి , యమదొంగ వంటి సినిమాలను చూస్తూ విపరీతంగా ఇష్టపడటం మొదలుపెట్టాడు. మరోవైపు తన తండ్రి రాజీవ్ కనకాల కు కూడా ఎన్టీఆర్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయితే తను నటిస్తున్న మొగ్లి సినిమా టీజర్ కూడా ఎన్టీఆర్ విడుదల చేశారు. అయితే ఎన్టీఆర్ లో ఉన్న మాస్ కమర్షియల్ యాంగిల్ అంటే విపరీతంగా రోషన్ కు ఇష్టం అని చెప్పారు. అన్ని బాగుంటే ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం కూడా వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
Also Read: Rajinikanth : నీలాంబరి పాత్రను మిస్ చేసుకున్న ఐశ్వర్యరాయ్, అసలు బ్యాక్ స్టోరీ ఏంటంటే?