E-Paper
Advertisement

రౌడీ స్టార్ ‘జనార్థన’ హంగామా.. ఇదంతా కేవలం హైప్ కోసమేనా?

రౌడీ స్టార్ ‘జనార్థన’ హంగామా.. ఇదంతా కేవలం హైప్ కోసమేనా?
Advertisement

Rowdy Janardhan:అర్జున్ రెడ్డి..అంటూ ఏ ముహుర్తాన కల్ట్ సినిమా తీసాడో గాని అప్పటి నుండి దాన్ని మ్యాచ్ చేసే సినిమా పట్టలేక తల పట్టేసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ప్యాన్ ఇండియా రేంజ్ లో సౌండ్ చేస్తుందనుకున్న లైగర్, సక్సెస్ ఇస్తుందనుకున్న కింగ్ డమ్ ఇలా చేసిన ప్రతీ సినిమా బోల్తా కొట్టిందే. దీనితో ఈ రౌడీ హీరో ఆశలన్నీ ఇప్పుడు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో వస్తున్న ‘రౌడీ జనార్థన’, రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’ పైనే పెట్టుకున్న పరిస్థితి.

రౌడీ జనార్థన’ కోసం టోటల్ గా ఊర మాస్

Advertisement

నిజానికి విజయ్ దేవరకొండ అంటేనే కొంచెం సాప్ట్ కొంచెం మాస్. కానీ మొదటిసారిగా ‘రౌడీ జనార్థన’ కోసం టోటల్ గా ఊర మాస్ అవతారం ఎత్టినట్టు గ్లిమ్ప్స్ చూస్తేనే అర్థం అవుతుంది.అయితే సినిమా 80ల కాలం నాటి బ్యాక్ డ్రాప్ , ఈస్ట్ గోదావరి యాస అంటూ విజయ్ చేస్తున్న ఈ ప్రయోగం వినడానికి బాగానే ఉన్నా, స్క్రీన్ మీద ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది క్వశ్చన్ మార్క్ . ముఖ్యంగా రాక్షసుడి లాంటి క్యారెక్టర్ అంటే అది ‘అఖండ’ లాంటి బాలయ్య సినిమాకో లేక ఎన్టీఆర్ కో సెట్ అవుతుంది కానీ, విజయ్ కి అసలు సెట్ అవుతుందా? అంటూ డౌట్స్ రైజ్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.

పెద్ద బడ్జెట్ పెట్టి దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా?

Advertisement

ఇక ఈ మధ్యే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి నెట్టింటిని షేక్ చేసింది . అయితే ఈ ‘పెళ్లి’ వల్ల సినిమా షూటింగ్‌ ఆగిపోయిందని, దీనివల్ల సినిమా బడ్జెట్ బాగా పెరిగిపోయిందని ఇండసైడ్ టాక్. మరో వైపు రవి కిరణ్ కోలా లాంటి యంగ్ డైరెక్టర్ మీద ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా? అన్న డిస్కషన్ ఇండస్ట్రీలో గట్టిగానే నడుస్తుందట. ఇక ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే, పాత సినిమాలని మిక్సీలో వేసి రుబ్బినట్టు ఉందని, అందులో కొత్తదనం ఏ కోశానా లేదని పెదవి విరుస్తున్నారు నెటిజన్లు. భారీ ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లాన్.

భారీ ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లాన్

ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా కోసం ఒక భారీ ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లాన్ చేశారట మేకర్స్. దీని కోసం కోట్లు ఖర్చు చేసి ప్రత్యేకమైన సెట్ వేయిస్తున్నారట కూడా . దీంతో సినిమా కంటెంట్ మీద నమ్మకం లేనప్పుడే ఇలాంటి భారీ సెట్లు మరియు ‘యాక్షన్ సీక్వెన్సుల’తో కవర్ చేస్తారని ట్రోల్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. ఇక 80వ కాలం నాటి రియల్ ఇన్సిడెంట్ అని అని చెబుతున్నా, అందులో డ్రామా కంటే హింస ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది.

మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా

ఇక ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోందన్న సంగతి తెల్సిందే. అయితే విజయ్-కీర్తిల కాంబినేషన్ ఆన్-స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే వరుస ప్లాపులతో ఉన్న విజయ్, ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తున్నా అని బిల్డప్ ఇస్తున్నా మాటలు కేవలం పబ్లిసిటీ స్టంట్స్ మాత్రమేనా లేక నిజంగానే మ్యాజిక్ చేస్తారా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.

Related News

“గెట్ వెల్ సూన్ బాబాయ్” – బాలయ్య ప్రమాదంపై కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్!

షూటింగ్ లో జారిపడ్డ బాలకృష్ణ.. హెల్త్ కండిషన్ పై డైరెక్టర్ గోపీచంద్ క్లారిటీ!

OGకి కొరియన్ కనకరాజుకి ఉన్న కనెక్షన్ ఏంటి?

NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

Big Stories

Advertisement
×