E-Paper
Advertisement

Senior Relationships: ఈ సీనియర్ భామల లవ్ స్టోరీస్..ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్!

Senior Relationships: ఈ సీనియర్ భామల లవ్ స్టోరీస్..ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్!
Advertisement

Senior Relationships: సినిమా గ్లామర్ ప్రపంచంలో రిలేషన్ షిప్స్ అంటే ఎప్పుడూ ఒక మిస్టరీనే. తాజాగా ఇద్దరు సీనియర్ నటీమణులు దివ్య దత్తా (48) మరియు కునీకా సదానంద్ (62) తమ వ్యక్తిగత జీవితంపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. ఒకరు “సింగిల్ లైఫ్ ఈజ్ హ్యాపీ లైఫ్” అని బోర్డు తిప్పేస్తే, మరొకరు “ఆరు సంబంధాలు విఫలమైనా.. ఏడో దాని కోసం రెడీ” అంటూ షాకిస్తున్నారు.

తోడు కోసం త్యాగాలు చేయలేనన్న దివ్య దత్తా

Advertisement

ముందుగా దివ్య దత్తా (48) గురించి చెప్పుకోవాలి.’వీర్ జారా’, ‘ఛావా’ వంటి సినిమాలతో మెప్పించిన ఈమె వైబ్ అంతా ”పీస్ ఈజ్ మస్ట్” అన్నట్లు ఉంటుంది. యస్ .. 48 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోలేదని అడిగితే, అమ్మడు ఇచ్చే రిప్లైలు మామూలుగా లేవు. “సొసైటీ కోసం ఎవరినో ఒకరిని తగిలించుకుని నా మెంటల్ పీస్‌ని పాడుచేసుకోలేను” అంటూ క్లారిటీ ఇచ్చేసింది. గతంలో కొన్ని షిప్పులు (Relationships) నడిచినా, అవి తీరం చేరలేదట. “స్నేహితులుగా ఓకే కానీ, లైఫ్ పార్ట్నర్స్ గా సెట్ అవ్వరు” అని బ్రేక్-అప్ చెప్పేసింది. సింపుల్‌గా చెప్పాలంటే,  “Better Single than in a Situationship” అన్నది ఇపుడు దివ్య దత్తా మోటో.

62లోనూ సెర్చ్ కొనసాగుతోందన్న కునీకా సదానంద్

Advertisement

ఇక మరోవైపు కునికా సదానంద్ (62) సీన్ పూర్తిగా వేరు. 62 ఏళ్ల వయసులో కూడా “ప్రేమకు వయసుతో పనిలేదు” అంటూ డేటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటివరకు 2 పెళ్లిళ్లు, 2 లివ్-ఇన్ రిలేషన్స్, మరో 2 షార్ట్ టర్మ్ డేటింగ్స్.. ఇలా మొత్తం 6 సార్లు ట్రై చేసినా, ఏడో సారి కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అంటోంది. ఒకప్పుడు కుమార్ సానుతో లవ్ ట్రాక్ నడిపిన ఈ సీనియర్ నటి, ఇప్పుడు మాత్రం ఒక ‘లాంగ్ టర్మ్ కమిట్మెంట్’ కోసం వెతుకుతోందట. ఇక  ఈమె ఎనర్జీ చూస్తుంటే.. “Don’t give up on love” అనే కోట్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పకతప్పదు.

సింగిల్ vs డబుల్ 

మొత్తానికి  ఒకరు ‘క్వాలిటీ’ కోసం వెయిట్ చేస్తూ సింగిల్ గా ఉండిపోతే, మరొకరు ‘తోడు’ కోసం ఎన్నిసార్లైనా ట్రై చేయడానికి వెనకాడటం లేదన్న మాట . ఒకరిది ‘Peace over People’ పాలసీ అయితే, మరొకరిది ‘Hope over History’ పాలసీ.ఇక ఈ ఇద్దరి థాట్స్ చూస్తుంటే నెటిజన్లు ఫిదా అవుతున్నారు కూడా. . ఏదేమైనా ఈ సీనియర్ భామల బోల్డ్ స్టేట్‌మెంట్స్ ముందు కుర్ర హీరోయిన్ల లవ్ స్టోరీలు కూడా దిగదుడుపే అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే !

Related News

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

Big Stories

Advertisement
×