Shaheen Bhatt:సాధారణంగా ఇండస్ట్రీలో పెళ్లిళ్లంటేనే ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది స్టార్ కిడ్స్ పెళ్లిళ్లు అంటే ఆ హంగామానే వేరు. ఇదిగో తాజాగా అలాంటి హంగామానే బాలీవుడ్ బడా ఫిలిమ్ మేకర్ మహేష్ భట్ ఇంట్లో మొదలైపోయింది. నామ్, అషికి, సడక్, క్రిమినల్ వంటి సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్ ఈయన డైరెక్షన్లో వచ్చినవే. ఇక బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న RRR బ్యూటీ ఆలియా భట్ ఈయన కూతురన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆలియా భట్ అక్క షాహీన్ భట్ ఎంగేజ్ మెంట్ జరిగిందన్న వార్తలు మీడియాలో హైలెట్ అయ్యాయి.
అతిగా ప్రేమించేశాం అంటూ క్లారిటీ..
అయితే మామూలుగా లో-ప్రొఫైల్ మెయింటైన్ చేసే షాహీన్, తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. “మేము ఒకరినొకరు ఇష్టపడటంలో కాస్త అతిగా (Too much) చేశామేమో” అంటూ తమ రిలేషన్‌షిప్‌లోని డెప్త్‌ను బయటపెట్టేసింది. దీంతో వీరిద్దరూ గత కొన్నాళ్లుగా సీరియస్ ప్రేమలో ఉన్నారని స్పష్టమైంది. ఇక ఈ పోస్ట్ ఇలా వచ్చిందో లేదో బాలీవుడ్ భామలు అనన్య పాండే, షనయా కపూర్, మసాబా గుప్తాలు హార్ట్ ఎమోజీలతో తమ విషెస్ చెప్పుకొచ్చారు.
ఎవరీ ఇషాన్ మెహ్రీ?
ఇక షాహీన్ భట్ ఎంగేజ్ మెంట్ అయిందో లేదో ఈ అమ్మడు మనసు దోచుకున్న ఆ అందగాడు ఎవరా అంటూ అప్పుడే ఆరాలు తీసే పనిలో పడ్డారు మన నెటిజన్లు. షాహీన్ భట్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు ఇషాన్ మెహ్రీ అని, ఆయన ఒక సెలబ్రిటీ స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ ట్రైనర్ అని బాలీవుడ్ స్టార్ల ఫిట్‌నెస్ వెనుక ఇషాన్ హ్యాండ్ ఉంటుందని బీ టౌన్ లో వినిపిస్తున్న టాక్.
ఇక షాహీన్ భట్ విషయానికి వస్తే, తను స్క్రీన్ రైటర్‌గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడమే కాకుండా, మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ పైన యాక్టివ్‌గా పనిచేస్తుందట కూడా. ఇక ఈ ఎంగేజ్ మెంట్ వేడుకలో షాహీన్ తల్లి సోనీ రజ్దాన్ మాత్రమే కాకుండా, ఆలియా అత్త నీతూ కపూర్ కూడా ఈ జంటను ఆశీర్వదించారు. సీనియర్ యాక్ట్రెస్ నీనా గుప్తా, జోయా అక్తర్ వంటి వారు కూడా ఈ వేడుకలో సందడి చేయడం విశేషం. ఇక ఈ వేడుకతో పూజా భట్, ఆలియా భట్ తర్వాత ఇప్పుడు అందరి ఫోకస్ షాహీన్ పెళ్లిపైనే ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు.
ఆలియా విషయానికి వస్తే..
ఇక చెల్లి ఆలియా భట్ విషయానికి వస్తే అక్క కన్నా నాలుగేళ్ల ముందే రణబీర్ కపూర్‌ను పెళ్లాడగా, ప్రస్తుతం మూడేళ్ల కూతురు రాహాతో మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. మొత్తానికి త్వరలో తన పెద్దమ్మ పెళ్లిలో రాహ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతుంది అన్న మాట.
ఇక గత సినిమా ‘జిగ్రా’తో మెప్పించలేకపోయిన ఆలియా త్వరలోనే యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ స్పై యూనివర్స్ చిత్రం ‘ఆల్ఫా’తో ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇక బీ టౌన్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 25, 2026న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుందట. దీంతో పాటు భన్సాలీ డైరెక్షన్లో తన భర్త రణబీర్ కపూర్ మరియు విక్కీ కౌశల్‌తో కలిసి నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ చిత్రంపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. చూడాలి మార్చి 20, 2027న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆలియాకి ఎలాంటి మెమోరీస్ మిగిలిస్తుందో!