E-Paper
Advertisement

Year End Movies 2025 : ఈ ఏడాది గూగుల్లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..

Year End Movies 2025 : ఈ ఏడాది గూగుల్లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..

Year End Movies 2025 : ప్రతి ఏడాది ప్రముఖ సంస్థ గూగుల్ ఇయర్ ఎండ్ గూగుల్ లో సెర్చ్ చేసిన వివిధ వాటి జాబితాను వెల్లడిస్తుంది… గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా గూగుల్లో చాలా మంది కొత్త సినిమాల గురించి సెర్చ్ చేశారు. ఈ ఏడాది గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాలను, వెబ్ సిరీస్ ల లిస్ట్ ను తాజాగా వెల్లడించింది.. ఆ లిస్ట్ లో ఏ సినిమాలు ఉన్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో టాప్ లో మూవీస్, వెబ్ సిరీస్ లు.. 

కాంతార చాప్టర్ 1.. 

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం కాంతార చాప్టర్ 1.. అక్టోబర్ 2, 2025న రిలీజైంది. ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా 852.06 కోట్లు వసూలు చేసింది. గతంలో వచ్చినా కాంతార సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో టాప్ లో ఉన్న మూవీ ఇదే కావడం విశేషం..

సైయారా..

మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూలై 18, 2025న రిలీజైంది.. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అహాన్ పాండే, అనీత్ పడ్డా హీరోహీరోయిన్లుగా నటించారు.. ఈ మూవీ పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.. గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి..

కూలీ…

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ప్రధానోపాత్రలో నటించిన తాజా చిత్రం కూలీ.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ తమిళ సినిమా ఆగస్టు 14, 2025న రిలీజైంది… ఈ మూవీ మొదటి నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. థియేటర్లలోకి రిలీజ్ అయిన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా 520 కోట్ల వసూళ్లను రాబట్టింది.

వార్ 2..

2019 బ్లాక్‌బస్టర్ ‘వార్’కి ఇది సీక్వెల్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్ 2’ ఆగస్టు 14, 2025న రిలీజైంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఇందులో నటించారు.. ప్రపంచవ్యాప్తంగా రూ.364.35 కోట్లు వసూలు చేసింది. ఎక్కువ మంది గూగుల్ లో సెర్చ్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి..

సనమ్ తేరీ కసమ్..

రాధికా రావు, వినయ్ సప్రూ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.. 2016లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేస్తుంది.. అదేవిధంగా ఈ ఏడాదిలో ఈ సినిమా మరోసారి థియేటర్లలో రిలీజ్ అయ్యి అది మ్యాజిక్ ని రిపీట్ చేసింది. పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. ఈ ఏడాది గూగుల్లో వెతికిన టాప్ సెర్చ్ మూవీస్ లలో ఇది కూడా ఒకటి..

వీటితో పాటుగా మార్కో, మహావతార్ నరసింహ, గేమ్ చేంజర్ సినిమాలు ఉండటం విశేషం..

టాప్ సెర్చ్ వెబ్ సిరీస్ లు..

స్క్విడ్ గేమ్..

దక్షిణ కొరియాలో రూపొందించబడిన ఒక ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ సిరీస్, ఇది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు కొందరు డబ్బుల కోసం రహస్య పోటీలో పాల్గొంటున్నారు. అయితే ఆ గేమ్ లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో వచ్చిన రెండు సిరీస్ లు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఏడాది సీజన్ 3 ని కూడా ప్రేక్షకులకు అందించారు.. గూగుల్ లో వెతికిన టాప్ సర్చ్ వెబ్ సిరీస్ లలో ఇది ఒకటి..

పంచాయత్సీజన్ 4..

సూపర్ హిట్ విలేజ్ కామెడీ డ్రామా సిరీస్ ‘పంచాయత్’ సీజన్ 4 ఓటీటీలోకి వచ్చేసింది. గత 3 సీజన్ల మాదిరిగానే అంతే కామెడీ.. ఎలక్షన్ హీట్‌తో అందుబాటులోకి వచ్చింది.. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఇది స్ట్రీమింగ్ వచ్చింది. దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయ్ వర్గీయ దర్శకత్వం వహించగా.. జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, సునీతా రాజ్వార్, దుర్గేష్ కుమార్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఇది గూగుల్ సెర్చ్ లో టాప్ లో ఉంది.

బిగ్ బాస్.. 

బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని ఇండస్ట్రీలలోనూ ఈ షో ప్రస్తుతం ప్రసారమవుతుంది. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న టీవీ షోలలో బిగ్ బాస్ ముందు వరసలో ఉంది. ఈ ఏడాది ఎక్కువమంది సెర్చ్ చేసిన గూగుల్ సెర్చ్ లో బిగ్ బాస్ టాప్ లిస్టులో ఉండడం విశేషం.

వీటితో పాటుగా ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వంటి టాప్ వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి.

Related News

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

Big Stories

×