Tollywood:యంగ్ హీరోగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి దాదాపు 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను వెండితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఈ సినిమాకి ప్రస్తుతం మంచి విజయం లభించింది .ఈ సందర్భంగా ఈ సినిమాలో విలన్ పాత్రలో సిద్దయ్యగా నటించిన యాక్టర్ లతీష్ కి మంచి పేరు లభించింది. ఇక తనకు దక్కిన ఈ మొదటి విజయం గురించి మాట్లాడుతూ.. తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. అలాగే ఆయన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేనిది అంటూ ఎమోషనల్ అయ్యారు.
కిరణ్ అబ్బవరం సినిమా చూసిన తర్వాత టీం మొత్తాన్ని మెచ్చుకున్నారు. అందులో మరీ ముఖ్యంగా ప్రదీప్ అన్నని, నన్ను ఎంతో ప్రశంసించారు. బయట ఇంత సైలెంట్ గా ఉన్నావ్.. స్క్రీన్ మీద అలా కనిపించావు ఏంట్రా అని ఆశ్చర్యపోయారు. అద్భుతంగా చేసావని మెచ్చుకున్నారు. నరేష్ అగస్త్య గారు కూడా చాలా పొగిడారు. మా బషీర్ సార్ కూడా నన్ను మెచ్చుకున్నారు .నలుగురు శిష్యులు ఒకే సినిమాలో కనిపించడంతో బషీర్ సార్ ఆనందానికి అవధుల్లేవు. ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిన తర్వాత నా గురించి చెప్పి నన్ను హగ్ చేసుకున్నారు. ఆ క్షణాలు, సినిమాల్లోకి వెళ్లాలని ప్రోత్సహించిన ఆ తీరును నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ లతీష్ తెలిపారు.
నగరిలోని వ్యవసాయ ఆధారిత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన లతీష్ మాట్లాడుతూ.. ఉప్పు దొంగతనం చేసి భోజనం తిన్న రోజులు ఉన్నాయి. మమ్మల్ని మా అమ్మ నాన్న, అన్నయ్య కష్టపడి చదివించారు. నేను సినిమాల్లోకి వచ్చానని మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేశాడు. కానీ ఈ సినిమా చూసి అందులో నా పెర్ఫార్మెన్స్ చూసి ఆయన మాట్లాడారు. నా ప్రయాణంలో ఎప్పుడూ నాకు అండగా నిలబడిన వారిలో అక్క చాముండేశ్వరి, మామ కోటేశ్వరరావు ముందుంటారు.
బెంగళూరులో కొన్ని రోజుల్లో ఉద్యోగం చేశాను. 2017లో హైదరాబాద్ కి వచ్చి అప్పటి నుంచే సినిమాలలో నటించాలని ప్రయత్నించాను. అందరు నా యాక్టింగ్ బాగానే ఉందని అంటూ చెప్పారు.కానీ ఎవరు అవకాశం ఇవ్వలేదు. మహిపాల్ వద్ద కొన్ని రోజులు అసిస్టెంట్గా పనిచేశాను. కరోనా వల్ల కొంత గ్యాప్ తీసుకొని యూట్యూబ్ లోని ఒక షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసి నటించాను. మళ్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేశాను అంటూ తెలిపారు.
షార్ట్ ఫిలిమ్స్ చేసేటప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను కెమెరా కొనుక్కునేందుకు ఇంట్లో వాళ్ళనే డబ్బులు అడిగాను నిర్మించేందుకు డబ్బులు పెట్టేందుకు ఎవరూ రాలేదు నాకు ఏ అసోసియేషన్ లోను మెంబర్షిప్ లేదు వేరే డైరెక్టర్ మీద ఆ కథను రిజిస్టర్ చేయించాను నిర్మాత కూడా నన్నే డబ్బులు అడిగాడు ఆ తర్వాత బషీర్ వద్ద నేను ట్రైనింగ్ తీసుకున్నాను.
ALSO READ:Kissik Talks: ప్రతి అమ్మాయికి ఆ సపోర్టు ఉండాలి – ప్రియా శెట్టి
బి స్టూడియోలో పార్ట్ టైం గా పని చేస్తున్నాను చాలా మంది నుంచి ఫోన్స్ వస్తున్నాయి కథలు వింటున్నాను కానీ ఇంతవరకు ఏదీ క్లారిటీ లేదు త్వరలోనే అన్ని ఒక కొలిక్కి వచ్చేలా ఉన్నాయి అంటూ లతీష్ తెలిపారు.