E-Paper
Advertisement

Daggubati Rana : ‘కాంత’ సినిమా.. రానా పై పోలీస్ కేసులు నమోదు.. ఎందుకంటే..?

Daggubati Rana : ‘కాంత’ సినిమా.. రానా పై పోలీస్ కేసులు నమోదు.. ఎందుకంటే..?
Advertisement

Daggubati Rana : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం కాంత.. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్‌ సల్మాన్‌ ‘వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్‌ మీడియా’ సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 14న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. రిలీజ్ కి ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మిక్సీ్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కొన్ని ఏరియాల్లో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది..ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో ఈ మూవీ ఎఫెక్ట్ వల్ల తన పై పోలీస్ కేసు నమోదు అయిన విషయాన్ని రానా బయటపెట్టారు. అసలేం జరిగింది..? పోలీస్ కేసు ఎందుకు అనేది వివరంగా తెలుసుకుందాం..

‘కాంత’ మూవీ ఎఫెక్ట్ రానా పై కేసు.. 

దుల్కర్ సల్మాన్, రానా సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన మూవీ కాంత.. సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. నిన్న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. హీరోయిన్ భాగ్య శ్రీ, రానా ఆ మీట్ లో సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రానా మాట్లాడుతూ.. దుల్కర్ ఈ మూవీలో చాలా బాగా నటించారు. మ్యూజిక్, విజువల్స్ టెక్నికల్ వాల్యూస్ గురించి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూ వున్నా సినిమా ఇది. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్ వస్తుంది. మద్రాస్ నేపథ్యంతో సాగడం వల్ల అక్కడి ఆడియన్స్ మరింతగా కనెక్ట్ అయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కి వెళ్లిన వాళ్లకు సినిమా. అయితే ఈ సినిమా వల్ల చెన్నైలో నా పై మూడు కేసులు నమోదు అయ్యాయని అన్నారు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది..

కాంత స్టోరీ విషయానికొస్తే.. 

Advertisement

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గతంలో ఎన్నడూ కనిపించిన విధంగా ఈ సినిమాలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.1950 కాలం నాటి స్టోరీతో ఈ మూవీ తెరకెక్కింది. ఆ కాలంలో వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో అలా మూవీని తెరకెక్కించారు. టికే మహదేవన్ గా దుల్కర్ సల్మాన్ నటించారు. ఇందులో ఈయన ఒక మహా నటుడు. నట చక్రవర్తి అనే బిరుదాంకితుడు. అయ్యా(సముద్రకని)సినిమా డైరెక్టర్. ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో చేస్తుంటారు. అయితే ఆ ఇద్దరి మధ్య అస్సలు పడదు. స్టార్ హీరో అయినా అతని కథలో వేలు పెడుతుంటాడు. ఆయన కథలో మార్పులు చేస్తుంటాడు. ఇద్దరి మధ్య సంధి చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ సాధ్యం కాదు. అలాగే సినిమా చివరికి వరకు వస్తుంది. ఈ క్రమంలో సడెన్ గా కుమారి హత్య చేయబడుతుంది. ఆ హత్య ఎవరు చేశారు? అనే కోణంలో సెకండ్ హాఫ్ సాగుతుంది. అయితే ఆమె హత్యకు కారణం దర్శకుడా? హీరోనా? ఇంకెవరైనా అనే నేపథ్యంలో స్టోరీ ఉంటుంది.. ఈ మూవీ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×