E-Paper
Advertisement

Tollywood Lord Rama Actors: వెండితెర శ్రీరామ చంద్రులు

Tollywood Lord Rama Actors: వెండితెర శ్రీరామ చంద్రులు
Advertisement

Tollywood Lord Rama Actors: శ్రీరామనవమి వచ్చేసింది.ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆ కాలం నుండి ఈ కాలం దాకా వెండితెరపై శ్రీరాముడి పాత్రలో కనిపించినవారెందరో.మరి ఈ శ్రీ రామనవమి సందర్భంగా తెలుగు ప్రేక్షకులని మైమరిపించి, నీరాజనాలు అందుకున్న ఆ టాలీవుడ్ స్టార్స్ ఎవరో మనమూ చూసేద్దాం.

శ్రీరాముడంటే తారకరామారావే !
తెలుగు నాట ఇప్పటికీ రాముడు అంటే చటుక్కున గుర్తొచ్చే పేరు నందమూరి తారకరామారావే.ముఖ్యంగా లవ కుశ సినిమాలో రాముడిగా ఆయన పోషించిన పాత్ర, చూపించిన రాజసం, పలికించిన హవాబావాలు ఇప్పటికీ మర్చిపోలేం.ఇక రాముడి గెటప్ లో ఉన్న ఫోటోలని ప్రేక్షకులు ప్రేములు కట్టించి ఇళ్ళల్లో పెట్టుకున్నారంటే ఎన్టీఆర్ ని రాముడిగా ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థమవుతుంది.ఇక అధికంగా రామారావ్ లవకుశ (1963), శ్రీరామాంజనేయ యుద్ధం (1975),సీతారామ కళ్యాణం (1961),శ్రీకృష్ణ సత్య (1971), భూకైలాస్ అంటూ అయిదు సినిమాల్లో రాముడి పాత్రని పోషించడం విశేషం.

Advertisement

అందాల రాముడి గా శోభన్ బాబు
ఇక రామారావ్ తర్వాత శ్రీరాముడి పాత్రని ఎవరూ అంత బాగా చేయలేరు అని అనుకుంటున్న తరుణంలో నేనూ పోషించగలను అంటూ ముందుకొచ్చాడు అందాల రాముడు శోభన్ బాబు. ముఖ్యంగా ఆయన సంపూర్ణ రామాయణంలో పోషించిన రాముడి పాత్ర ఇప్పటికీ ఆడియన్స్ మర్చిపోలేదంటే ఎంతగా అలరించారో అర్థం అవుతుంది. అయితే ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న శోభన్ బాబు రాముడి పాత్ర వేస్తె చూస్తారా అని పెదవి విరిచిన వారే మెచ్చుకోవడం విశేషం.

తండ్రిబాటలోనే కొడుకు
ఇప్పటి తరంలో నవరసాలు అలవోకగా పోషించగలడన్న పేరు తెచ్చుకున్న బాలయ్య తండ్రి వారసత్వాన్ని భుజాలపై మోస్తూ రాముడిగా అలరించిన సినిమా శ్రీ రామరాజ్యం.బాలయ్య అంటే మాస్ కి కేరాఫ్ అనుకుంటున్న టైం లో బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించి ఒప్పించింది.ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య నటనతో పాటు సంగీతం కూడా అప్పట్లో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది .

Advertisement

ఇక తాతబాటలోనే మనవడు
ఇక ఇప్పుడంటే యాక్షన్, మాస్ సినిమలాకి అడ్రస్ లా మారిన తారక్ కూడా 16 ఏళ్ల వయసులో రాముడి గా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణంతో అలరించిన వాడే.ఒకరకంగా చిన్న తనంలోనే తనలోని నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించాడు తారక్. నందమూరి వంశం అంటే పౌరాణికాలకి పెట్టింది పేరని మరోసారి ప్రూవ్ చేశాడు ఈ నందమూరి చిన్నోడు.

also read :Tollywood Movies : 2027 లో తెలుగు సినిమాల మధ్య పోటీ మాములుగా లేదుగా.. స్టార్స్ వారే..

అధిపురుషుడిగా డార్లింగ్
ఇక బాహుబలితో వరల్డ్ వైడ్ క్రేజ్ కొట్టేసిన డార్లింగ్ రాముడిగా ఆదిపురుష్ సినిమాతో అలరించిన సంగతి తెల్సిందే. ఇక ఆరడుగుల ఆజానుబావుడిగా ప్రభాస్ శ్రీరాముడి గెటప్ లో అదరగొట్టినప్పటికీ, ఓం రౌత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా క్వాలిటీ లెస్ గ్రాఫిక్స్ తో ట్రోలర్స్ కి పెద్ద స్టఫ్ గా మిగిలిపోవడం గమనార్హం.

ఇక వీళ్ళే కాకుండా సీతారామ జననం (1944)లో రాముడిగా అక్కినేని,’సీతారామ కళ్యాణం’ సినిమాలో హరనాథ్,సీతా కళ్యాణం (1976)లో రాముడిగా తమిళ నటుడు రవికుమార్,’శ్రీరామదాసు'(2006) సినిమాలో శ్రీరాముడిగా సుమన్,’దేవుళ్లు’ (2000) సినిమాలో అతిథి పాత్రలో శ్రీకాంత్ రాముడి పాత్రలు పోషించి మెప్పించిన వాళ్ళే !

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×