E-Paper
Advertisement

Upcoming Theater Movies : జూన్ లో థియేటర్లలోకి రాబోతున్న చిత్రాలు.. ఫ్యాన్స్ కు పునకాలే..

Upcoming Theater Movies : జూన్ లో థియేటర్లలోకి రాబోతున్న చిత్రాలు.. ఫ్యాన్స్ కు పునకాలే..
Advertisement

Upcoming Theater Movies in June : సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నెలలో ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. ఆ తర్వాత సమ్మర్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలకు డిమాండ్ ఉంటుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సమ్మర్ కాస్త చప్పగా ఉంది.. ఏప్రిల్, మే నెలలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు.. ఇక అందరి చూపు జూన్ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు వైపే పడింది. ఎందుకంటే ఈ నెలలో ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ, కన్నడ హీరో యాష్ నటించిన టాక్సిక్ మూవీ పోటీ పడబోతున్నాయని తెలుస్తుంది. మరి ఈ జూన్ నెలలో సినిమాల సందడి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జూన్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..

‘పెద్ది ‘..

టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వి కపూర్ నటించిన లేటెస్ట్ చిత్రం పెద్ది.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ రొమాంటిక్ మూవీ గా వస్తున్న పెద్ది సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. సుకుమార్ రైటింగ్స్,మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం పై అంచనాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..

హై జవానీ తో ఇష్క్ హోనా హై..

Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హై జవానీతో ఇష్క్ హోనా హై.. రొమాంటిక్ డ్రామా గా రాబోతున్న ఈ సినిమాకి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సింగ్ గీతం..

ఇండస్ట్రీలో వరుస సినిమాలతో లెజండరీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న మ్యూజికల్ ఫాంటసీ మూవీ సింగ్ గీతం.. ఇక ఇందులో అయాన్, అహల్య బమ్రూ కీలక పాత్రలు పోషించారు.. జూన్ 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

భారత్ భాగ్య విధాత..

Advertisement

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భారత్ భాగ్య విధాత. జూన్ 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. బాలీవుడ్ లో మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్న ఏ మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మే వాపస్ ఆవుంగా జూన్ 12, కాక్ టెయిల్ 2, మా ఇంటి బంగారం, లెనిన్ వంటి చిత్రాలు కూడా జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. మొత్తానికి చూస్తే జూన్ నెలలో స్టార్స్ సినిమాల సందడి ఎక్కువగా ఉంది. చాలావరకు స్టార్ హీరోలు హీరోయిన్ నటించిన సినిమాలన్నీ కూడా జూన్ నెలలో రిలీజ్ కావడంతో ఆ నెలలో సినిమాలకి డిమాండ్ కూడా పెరిగిపోయింది. మరి జూన్ నెలలో పోటీ పడుతున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి బస్ ను క్రియేట్ చేసుకుంటే చూడాలి..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×