E-Paper
Advertisement

Vijay Rashmika: రష్మికతో విజయ్ పెళ్లి .. భయపడిన విజయ్ పేరెంట్స్.. ఏమైందటే ?

Vijay Rashmika: రష్మికతో విజయ్ పెళ్లి .. భయపడిన విజయ్ పేరెంట్స్.. ఏమైందటే ?
Advertisement

Vijay Rashmika: విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహం ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఫిబ్రవరి 26వ తేదీ ఘనంగా జరిగింది. ఇక వీరి పెళ్లి తర్వాత కూడా వీరికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ మేనమామ ప్రముఖ నిర్మాత ఎస్ రంగినేని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన రష్మిక విజయ్ దేవరకొండకు సంబంధించిన ఎన్నో విషయాలను బయటపెట్టారు.

విజయ్ ఎవరి మాట వినడు..

విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ విజయ్ చాలా మెచ్యూరిటీ కలిగిన వ్యక్తి అని తెలిపారు. ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే తన నిర్ణయాన్ని ఇంట్లో చెబుతారు. అయితే మనం ఆ విషయం గురించి ఎన్ని సలహాలు సూచనలు ఇచ్చిన తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోరని తనకంటూ ఒక బౌండరీ క్రియేట్ చేసుకున్నారని తెలిపారు. రష్మిక విజయ్ పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోతున్నారు. మరి రష్మికను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు విజయ్ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి అనే ప్రశ్న ఎదురయింది.

సినిమా సెలబ్రిటీల విడాకులు..

Advertisement

డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత విజయ రష్మిక ప్రేమ మొదలైందని తెలిపారు. రష్మిక తరచు ఇంటికి వచ్చి వెళ్లేదని అలా వారికి కెమిస్ట్రీ చూసి ప్రేమలో ఉన్నారని ఊహించామంటూ రంగినేని తెలిపారు. విజయ్ దేవరకొండ తన ప్రేమ విషయాన్ని వాళ్ళ అమ్మతో చెప్పారని, ఇక పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని చెప్పడంతో విజయ్ పేరెంట్స్ కాస్త భయపడ్డారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకు సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎవరైనా కాస్త భయపడతారు. ఆ భయం విజయ్ తల్లిదండ్రులలో కూడా కలిగిందని, కానీ మనం దీన్ని మార్చలేము . ఎవరైనా కలిసి ఉండటం విడిపోవడం అనేది వారి తలరాత అంటూ రంగినేని తెలిపారు.

రష్మిక సినిమాలకు విజయ్ ప్రోత్సాహం..

Advertisement

విజయ్ రష్మికను చూస్తే వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో రష్మిక చాలా సంతోషంగా ఉందని ఆమె సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయిన కలగని సంతోషం పెళ్లి చేసుకున్నప్పుడు కనిపించిందని జీవితాంతం వాళ్ళిద్దరూ అలాగే ఉండాలని కోరుకున్నారు. ఇక రష్మిక సినిమాల విషయంలో విజయ్ ప్రోత్సాహం ఉందని, ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయి బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకుంది అంటే తన టాలెంట్ తో పాటు విజయ్ ప్రోత్సాహం కూడా ఉందని తెలియజేశారు. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తూ విరోష్ జంట జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.

Also Read: Susmitha Konidela: చరణ్, నాన్న ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అదే.. సుస్మిత కొణిదెల కామెంట్స్ వైరల్!

Related News

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

Big Stories

Advertisement
×