E-Paper
Advertisement

Jananayagan Twitter Review : ‘ జననాయగన్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Jananayagan Twitter Review : ‘ జననాయగన్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
Advertisement

Jananayagan Twitter Review : స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన చివరి చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జననాయగన్‘. విజయ్ చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకులు రావాల్సిన సినిమా ఇప్పటివరకు థియేటర్లలోకి రాలేదు. సినిమాకు సెన్సార్ రివ్యూ సరిగ్గా లేకపోవడంతో విడుదల వాయిదా పడింది.. దాదాపు ఆరు నెలలకు పైగానే ఈ సినిమా రిపోర్టు కోసం చిత్ర యూనిట్ ఎంతగానో వెయిట్ చేసింది.. మొత్తానికి సినిమాని థియేటర్లలోకి రిలీజ్ చేసేందుకు సెన్సార్ సభ్యులు ఆమోదం తెలిపారు.. దాంతో ఇవాళ భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది.. విజయ్ దళపతి నటించిన సినిమా కోసం అభిమానులు గత కొద్దిరోజులుగా వెయిట్ చేస్తున్నారు.. మొత్తానికి గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చిన ఏ సినిమాని చూసేందుకు అటు విజయ్ అభిమానులతో పాటుగా తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాకు జనాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? విజయ్ అభిమానులను ఈ సినిమా ఆకట్టుకుందా? నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంది అన్నది ఇప్పుడు మనం ట్విట్టర్ రివ్యూ లో చూసేద్దాం…

విజయ్ దళపతి ఇప్పటివరకు ఎక్కువగా యాక్షన్ సినిమాలలోనే నటించాడు.. మొన్న వచ్చిన గోట్ మూవీ వరకు యాక్షన్ జానర్ లోనే సినిమాలు చేశాడు.. కానీ ఇప్పుడు కూడా యాక్షన్ స్టోరీతో పాటుగా సెంటిమెంట్ స్టోరీ కూడా ఉండటంతో జనాలు ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఈగర్ గా వెయిట్ చేశారు. కొలివుడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో, KVN ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది.. ఈ మూవీ పై రెస్పాన్స్ ఎలా ఉందంటే..?

Advertisement

జన నాయగన్ సినిమా ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులల్లో ఒక ఉత్కంఠను కొనసాగించింది.. హీరోని ఎలివేట్ చేసే కొన్ని సన్నివేశాలు మినహా, మిగిలిన చిత్రీకరణ అంతంతమాత్రంగానే ఉంది. కానీ విలన్ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు.. కొన్ని సీన్లు సినిమాకి హైలైట్ గా నిలిచాయి.. మొత్తానికి సినిమా బిజీ అభిమానులని ఆకట్టుకుంటుంది అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.

Advertisement

విజయ్ జన నాయగన్ మొదటి పార్ట్ కాస్త ఎంటర్టైన్మెంట్ చేసింది.. ప్రతి సీన్ ప్రేక్షకులను మెప్పించింది.. సెకండ్ హాఫ్ కాస్త తేలిపోయింది. ఈ సినిమాలో బాగా కలిసివచ్చిన అతిపెద్ద అంశం విజయ్, మమిత మధ్య ఉన్న భావోద్వేగ బంధం. అనిరుధ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ గా నిలిచింది.. అంతే కాదు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ నటనకు జనాలు ఫిదా అవుతున్నారు. మొత్తానికి సినిమా చాలా బాగుంది అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశారు..

జన నాయాగన్ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం విజయ్ దున్నేసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ వన్ మాన్ షో. ముఖ్యంగా విజయ్ కచేరి సీను మాత్రం జనాలని ఆకట్టుకుంటుంది. అనిరుద్ మ్యూజిక్ బాగుంది. మొత్తానికి సినిమా ను మిస్ అవ్వకుండా చూడాలి అంటూ ఒక నెటిజన్ ట్విట్ చేశారు..

విజయ్ దళపతి నటించిన చివరి సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది.. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.. తప్పు ఏడు నెలలు వెయిట్ చేసినా వాళ్ళ కళ ఇవాల్టితో నెరవేరింది అని చెప్పాలి.. ఈ సినిమా ఓవరాల్ గా బాగానే ఉన్నా అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్లు ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళనాడు సీఎం విజయ్ దళపతి నటించిన చివరి సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం వసూల్ అవుతాయో చూడాలి..

Related News

‘దాదా’గా విశ్వరూపం చూపించబోతున్న బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?

అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న అక్కినేని హీరో… ఇప్పటీకి బాధగా ఉందంటూ!

సూరి, సుహాస్ ‘మండాడి’ ట్రైలర్ రిలీజ్!

ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తా – అక్కినేని సుమంత్

కళ్ళుచెదిరే రేంజ్ లో ” వారణాసి” తెలుగు థియేట్రికల్ బిజినెస్.. టాలీవుడ్ లోనే హైయెస్ట్!

సినిమా ఖర్చుల్లో బిగ్ స్కామ్?.. బోగస్ బిల్లులతో కోట్ల గోల్‌మాల్!

హ్యాపీ బర్తడే మోక్షజ్ఞ.. కొత్త మూవీ అనౌన్స్మెంట్ కి ఈ రోజైనా మోక్షం లభిస్తుందా?

తమిళ్ ఇండస్ట్రీలో మళ్లీ ‘మీటూ’ మంటలు.. బాంబు పేల్చిన సింగర్!

Big Stories

Advertisement
×