Nilakanta : కొత్త ఏడాది సంక్రాంతి సీజన్‌లో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ తెలుగు ఆడియన్స్ ను పలకరించడానికి సిద్ధం అవుతోంది. మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న ‘నీలకంఠ’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 2న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. రాకేష్ మాధవన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం కుల వివక్ష, సామాజిక అన్యాయం వంటి థీమ్స్‌తో రూపొందింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సపోర్ట్ ఇవ్వడంతో మూవీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
రాకేష్ మాధవన్ దర్శకత్వంలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ ఈ మూవీని నిర్మించారు. మాస్టర్ మహేంద్రన్ ఇందులో మెయిన్ లీడ్. హీరోయిన్లుగా యష్నా చౌదరి, నేహా పఠాన్ నటిస్తున్నారు. స్నేహా ఉల్లాల్ స్పెషల్ అప్పియరెన్స్‌లో కనిపిస్తుంది. ఇతర కీ రోల్స్‌లో రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శీను ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో న్యూ ఇయర్ కానుకగా మూవీ రిలీజ్ ని ప్లాన్ చేశారు.
All the best to the entire team of #Nilakanta
▶️ https://t.co/q1UY2SNd68@Actor_Mahendran @yashnamuthuluri @Neha_pathan3 @iamsnehaullal@Rakeshmadha1 @FilmmakerSravan @Markprashu@anilinamadugu #MSrinivasulu #DVenugopal@lsproductionss @TeamStarCircle @Team_BigFish… pic.twitter.com/hj4SaaU1yi
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) December 29, 2025
న్యూ ఇయర్ రిలీజ్ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ని ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే టీజర్ విడుదలై ఆసక్తిని రేపింది. తాజాగా “వరల్డ్ ఆఫ్ నీలకంఠ” అనే టైటిల్ తో ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ ను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లాంచ్ చేయడం విశేషం. కిరణ్ సోషల్ మీడియాలో ట్రైలర్ ను షేర్ చేస్తూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ చెప్పాడు. ఆయన సపోర్ట్ ఖచ్చితంగా మూవీకి ప్లస్ అవుతుంది. ఈ ట్వీట్ కిరణ్ ఫ్యాన్ బేస్ ను కూడా థియేటర్లకు రప్పిస్తుంది.
ట్రైలర్ ను చూస్తే కుల వివక్ష, అణచివేతకు గురైన యువకుడి ప్రతీకారం, సామాజిక న్యాయం కోసం పోరాటం చుట్టూ కథ తిరుగుతుందని అర్థమవుతోంది. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ డ్రామా బాగున్నాయి. మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారిన తొలి సినిమా కావడం, పాన్ ఇండియా రిలీజ్, పైగా కిరణ్ అబ్బవరం లాంటి హీరోల సపోర్ట్ తో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. భారీ బజ్ క్రియేట్ చేస్తున్న ప్రమోషన్స్, కిరణ్ అబ్బవరం సపోర్ట్‌తో మంచి ఓపెనింగ్ దక్కే అవకాశం ఉంది. మరి సంక్రాంతి సీజన్ లో ‘నీలకంఠ’ ఎలా ఆడుతుందో చూడాలి.
Read Also :