E-Paper
Advertisement

Toxic Movie: టాక్సిక్ రన్ టైం.. ఆ సినిమాతో పోటీ వర్కౌట్ అవుతుందా?

Toxic Movie: టాక్సిక్ రన్ టైం.. ఆ సినిమాతో పోటీ వర్కౌట్ అవుతుందా?
Advertisement

Toxic Movie:కేజీఎఫ్ సీరీస్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యశ్ (Yash) , ఇప్పుడు ‘టాక్సిక్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో రాబోతున్నారు. గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఒక భారీ రన్ టైం వార్తతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 3 గంటల 15 నిమిషాల నిడివితో వస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. వివరాలలోకి వెళితే ..

యశ్ మార్క్ యాక్షన్.. 3 గంటల మేజిక్ సాధ్యమేనా: సాధారణంగా ఒక సినిమా మూడు గంటలు దాటిందంటే.. ప్రేక్షకుల్లో చిన్న భయం ఉంటుంది, కానీ అది రాకింగ్ స్టార్ యశ్ సినిమా అయితే అంచనాలు వేరే లెవల్‌లో ఉంటాయి. ఇక గీతూ మోహన్ దాస్ రాసుకున్న కథలో డెప్త్ చాలా ఎక్కువగా ఉందని, అందుకే సినిమా నిడివిని తగ్గించడానికి టీమ్ ఇష్టపడలేదని టాక్. ఈ మధ్య కాలంలో ‘యానిమల్’ లాంటి సినిమాలు సుదీర్ఘ రన్ టైంతో వచ్చి కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇక అదే నమ్మకంతో ‘టాక్సిక్’ టీమ్ కూడా ముందడుగు వేస్తోంది. కేవలం ఫైట్లు మాత్రమే కాకుండా, ప్రతి క్యారెక్టర్‌కు ఒక ఎమోషన్, ఒక బ్యాక్ స్టోరీ ఉంటుందని, అందుకే రన్ టైం అంత వచ్చిందని ఫిల్మ్ నగర్ సమాచారం. యష్‌ని అంత సేపు స్క్రీన్ మీద చూడటం ఫ్యాన్స్‌కు పండగే అయినా, సామాన్య ప్రేక్షకుడిని మెప్పించాలంటే కథలో ఆ పట్టు ఉండటం చాలా ముఖ్యం.

ధురంధర్ 2తో పోటీ.. బాక్సాఫీస్ వద్ద రసవత్తర పోరు:

Advertisement

సినిమా ఎంత బాగున్నా, థియేటర్లలో క్లాష్ అనేది వసూళ్లపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం ‘టాక్సిక్’ చిత్రం ‘ధురంధర్ 2’ వంటి మరో భారీ ప్రాజెక్ట్‌తో పోటీ పడాల్సి రావడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే, యష్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అది పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ, రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం థియేటర్ల పంపకాల్లో ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా ‘టాక్సిక్’ రన్ టైం 3 గంటల పైమాటే కాబట్టి, షోల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయినా సరే, కంటెంట్ పక్కాగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. ఈ భారీ రన్ టైం ఛాలెంజ్‌ని యష్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.

also read:Virosh Wedding Photos: రికార్డ్ సృష్టించిన విజయ్ – రష్మిక వెడ్డింగ్ ఫొటోస్.. 12 గంటల్లోనే

మార్చి 19న గ్రాండ్ రిలీజ్:

Advertisement

కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ టీజర్ చూస్తే, ఇది ఒక డార్క్ అండ్ రా గ్యాంగ్‌స్టర్ స్టోరీ అని అర్థమవుతోంది. రన్ టైం గురించి వైరల్ అవుతున్న వార్తలపై చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇక ఒకవేళ ఇదే నిజమైతే, యష్ కెరీర్‌లోనే అత్యంత నిడివి కలిగిన సినిమాగా ‘టాక్సిక్’ నిలుస్తుంది. మార్కెట్‌లో ఉన్న క్రేజ్ చూస్తుంటే, టాక్ కొంచెం పాజిటివ్‌గా వచ్చినా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవడం ఖాయం. యష్ తన స్టైల్, యాక్షన్ తో మరోసారి ఇండియన్ సినిమాను ఏలుతారా అన్నది తెలియాలంటే వేసవి వరకు ఆగాల్సిందే.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×