E-Paper
Advertisement

Varanasi: వారణాసి ఈవెంట్ ఖర్చు ఎంతో తెలుసా..ఈ డబ్బుతో ఓసినిమా చేయొచ్చు తెలుసా?

Varanasi: వారణాసి ఈవెంట్ ఖర్చు ఎంతో తెలుసా..ఈ డబ్బుతో ఓసినిమా చేయొచ్చు తెలుసా?
Advertisement

Varanasi: వారణాసి ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ గ్లోబల్ రేంజ్ లో ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (S.S.Rajamouli)దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటిస్తున్న సినిమాకి వారణాసి(Varanasi) అనే టైటిల్ పెట్టినట్లు తాజాగా చిత్ర బృందం అధికారకంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ విడుదల కోసం చిత్ర బృందం ఎంతో ఘనంగా గ్లోబ్ ట్రాటర్(Globe Trottere) పేరిట రామోజీ ఫిలిం సిటీలో ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఒక గ్లింప్ వీడియోని విడుదల చేశారు. అలాగే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ లో వారణాసి…

ఇలా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చినప్పటికీ ఎక్కడ ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా అభిమానులందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అందుకు అనుగుణంగా రాజమౌళి ఏర్పాట్లను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా 100 అడుగుల ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి గ్లింప్ వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఒక్క ఈవెంట్ కోసం కోట్ల ఖర్చు..

Advertisement

ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం ఎన్నో రకాల వార్తలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం కోసం ఎంత మొత్తంలో ఖర్చు చేశారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం సుమారు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు బయటకు రావడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కేవలం టైటిల్ రివీల్ ఈవెంట్ కోసం ఈ రేంజ్ లో ఖర్చు పెట్టడమా? ఈ ఖర్చుతో ఒక చిన్న సినిమానే చేయొచ్చు కదా జక్కన్న అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

రుద్ర పాత్రలో మహేష్..

Advertisement

ఇక ఈ ఈవెంట్ కోసం ఈ స్థాయిలో ఖర్చు చేసినప్పటికీ మొత్తం భారం నిర్మాతపై పడలేదని చెప్పాలి. ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ రైట్స్ జియో హాట్ స్టార్ కైవసం చేసుకున్నారు. స్పాన్సింగ్ యాడ్ ద్వారా సుమారు ఐదు కోట్ల రూపాయలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా ఈ ఖర్చులు పోను మిగతాది నిర్మాత తన బడ్జెట్ లో భాగంగా భరించాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఏది ఏమైనా రాజమౌళి అంటేనే ఫర్ఫెక్షన్ కు మారు పేరని చెప్పాలి. ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఈయన ఖర్చు విషయంలో వెనకాడరని మరోసారి నిరూపించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: AA22xA6: బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం పిక్స్!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×