E-Paper
Advertisement

Balakrishna: బాలయ్యపై మనసు పారేసుకుంటున్న యంగ్ బ్యూటీ..ఆ ఆరా ప్రత్యేకం అంటూ!

Balakrishna: బాలయ్యపై మనసు పారేసుకుంటున్న యంగ్ బ్యూటీ..ఆ ఆరా ప్రత్యేకం అంటూ!
Advertisement

Balakrishna:ఈ మధ్యకాలంలో స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna )పై కొంతమంది హీరోలు, హీరోయిన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో సక్సెస్ అందుకొని గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించిన హీరో శర్వానంద్(Sharwanand )బాలకృష్ణ ఆశీర్వాదం వల్లే తన సినిమా సక్సెస్ అయిందని, ఇకపై తన ప్రతి సినిమాకి పూజా కార్యక్రమం బాలయ్య చేతుల మీదుగా జరగాల్సిందే అంటూ బాలయ్యతో తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే హీరోలే కాదు ఇప్పుడు హీరోయిన్లు కూడా బాలయ్య పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక యంగ్ బ్యూటీ ఏకంగా బాలయ్యపై మనసు పారేసుకుంటూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

బాలయ్య పై మనసు పారేసుకుంటున్న యంగ్ బ్యూటీ.

అసలు విషయంలోకి వెళ్తే.. ‘బ్యాచిలర్’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయిన తమిళ బ్యూటీ దివ్యభారతి(Divya Bharathi)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈమె.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అటు సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం ‘గోట్’ (GOAT). సుడిగాలి సుదీర్ (Sudigali Sudheer) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతోనే ఈమె తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె.. అందులో పలు ఆసక్తికర విషయాలు తంచుకుంది.

బాలయ్యలో తెలియని ఆరా ఏదో ఉంది..

Advertisement

ఇంటర్వ్యూలో భాగంగా దివ్యభారతి మాట్లాడుతూ.. “టాలీవుడ్ లో నాకు బాలయ్య అంటే చాలా ఇష్టం. ఆయనకి ఒక పవర్ ఉంటుంది. ఒక ఆరా ఉంటుంది. ఆయన స్టైల్ చాలా ప్రత్యేకం. ప్రతి సినిమాలో ఆయన స్టైల్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన నటించిన సినిమాలలో సమరసింహారెడ్డి అంటే నాకు ఎంతో ఇష్టం. అయితే నేను గోట్ సినిమాలో పనిచేసేటప్పుడు అందులో చేసిన ఒక యాక్టర్ బాలయ్యకు చాలా క్లోజ్ అని చెప్పి, కాల్ చేసి మాట్లాడమని ఇచ్చారు.

also read:Sobhita dhulipala: ఆ విషయంలో తుది నిర్ణయం నాదే.. మరి చైతూ సంగతేంటి బేబీ?

ప్రాంక్ కాల్ అనుకున్నా..

Advertisement

అయితే నేను అబద్ధమేమో అనుకున్నాను.అంతేకాదు ప్రాంక్ అని కూడా భావించాను. అయితే కాల్ లో నిజంగానే బాలయ్య తమిళంలో మాట్లాడారు. ఆయన చాలా స్వీట్ గా మాట్లాడారు. తెలుగులో నీకు మొదటి సినిమా కదా.. ఆల్ ది బెస్ట్ అని నాతో అన్నారు.బాగా చేయండి అని చెప్పి చాలా బాగా మాట్లాడారు . అలాగే చెన్నై సంగతుల గురించి అడిగి మరీ తెలుసుకున్నారు” అంటూ చెప్పింది దివ్యభారతి. మొత్తానికైతే దివ్యభారతి బాలయ్యను డైరెక్ట్ గా కలవలేదు కానీ ఫోన్లో మాట్లాడానని చెప్పి తెగ సంతోష పడిపోయింది. అంతేకాదు ఆయనపై తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×