BigTV English
Advertisement

Khagen Murmu: ఇదేం ఎన్నికల ప్రచారం దొర.. మహిళకు ముద్దు పెట్టిన బీజేపీ అభ్యర్థి.. వైరల్ పిక్!

Khagen Murmu: ఇదేం ఎన్నికల ప్రచారం దొర.. మహిళకు ముద్దు పెట్టిన బీజేపీ అభ్యర్థి.. వైరల్ పిక్!
BJP Candidate Khagen Murmu Kisses Woman
BJP Candidate Khagen Murmu Kisses Woman

BJP Candidate Khagen Murmu Kisses Woman: ఎన్నికల హడాహుడి మొదలైందంటే చాలు అభ్యర్థులు ప్రజల మధ్యకు వచ్చి రకరకాలుగా వారని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒకరేమో చిన్నారులకు స్థానం చేస్తే.. మరొక అభ్యర్థి మహిళలతో కలిసి పొలంలో నాట్లు వేస్తూ ఓట్లు కోసం పాట్లు పడుతుంటారు. ఇంకొందరు వృద్ధులు, చిన్నారులను దగ్గరకు తీసుకుని వారిపై ప్రేమ ఉన్నట్లు ముద్దులు పెడుతుంటారు. అయితే తాజాగా ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ యువతిని ముద్దు పెట్టుకున్నాడు. ఈ పిక్ వైరల్ గా మారడంతో వివాదానికి దారితీసింది.


పశ్చిమబెంగాల్ ఉత్తర మాల్దా నియోజకవర్గం బీజేపీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి ఖగేన్ ముర్ము తన పార్లమెంట్ పరిథిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖగేన్ ముర్ము నియోజకవర్గంలోని ఇంటింటికీ తిరుగుతూ తనను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ యువతి చెంపపై ఖగేన్ ముర్ము ముద్దు పెట్టారు. దీంతో ఆ ఫోటీలు వైరల్ గా మారాయి.

ఈ ఫోటీలను ట్వీట్టర్ లో షేర్ చేస్తూ.. రాష్ట్ర అధికార పార్టీ అయిన తృణమాల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. బీజేపీ ఉత్తర మల్దా అభ్యర్థిగా ఉన్న ఖగేన్ ముర్ము తన ప్రచారంలో భాగంగా ఓ మహిళకు ఇష్టానుసారంగా ముద్దులు పెడుతున్నారని ఎక్స్ లో రాసుకొచ్చింది.


బీజేపీలో మహిళలను వేధించే నాయకులకు కొదవలేదని వెల్లడించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీల నుంచి.. బెంగాలీ మహిళలతో అభ్యంతరంగా పాటలు రాసే నాయకుల వరకు బీజేపీలో ఎటువంటి కొదవ లేదని ఆరోపించారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే ఇలాంటి వారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఊహించుకోవచ్చని టీఎంసీ ట్వీట్ చేసింది.

ఖగేన్ ముర్ము చేసిన ఈ చర్యకు గాను టీఎంసీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై టీఎంసీ మాల్దా జిల్లా వైస్ ప్రెసిడెంట్ దులాల్ సర్కార్ కూడా ఖండించారు. ఇది బెంగాలి సంస్కృతికి తీవ్ర విరుద్దమని అన్నారు. ఈ విషయంలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలని కోరారు. బీజేపీ అభ్యర్థులు ఓట్లు అడిగే సమయంలో ఇలా ఉంటే.. అధికారంలోకి వచ్చాక మరి ఎలా ప్రవరిస్తారో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.

అయితే తనపై టీఎంసీ చేస్తున్న విమర్శలపై ఖగేన్ ముర్ము తన దైన శైలిలో బదులిచ్చారు. ఓ ఆడబిడ్డను ముద్దుపెట్టుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. తనపై టీఎంసీ కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తోందన్నారు. టీఎంసీ చేస్తున్న వ్యాఖ్యలపై తాము ఫిర్యాదు చేస్తానని అన్నారు.

Also Read: క్షమాపణలను అంగీకరించం.. చర్యలకు సిద్ధంగా ఉండండి.. పతంజలిపై సుప్రీం సీరియస్

దీంతోపాటుగా బీజేపీ అభ్యర్థి ముద్దు పెట్టిన సదరు మహిళ కూడా సమర్థించింది. ఓ వ్యక్తి తన సొంత కూతురు లాంటి స్రీని ముద్దుపెట్టుకుంటే తప్పేముందని ఆమె తిరిగి ప్రశ్నించారు. ఖగేన్ తనను కూతురిలా భావించి ముద్దు పెట్టుకున్న సమయంలో తన అమ్మ, నాన్న కూడా పక్కనే ఉన్నారని ఆమె తెలిపింది.

Tags

Related News

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Big Stories

×