BigTV English

Actress Kasiyammal was Murdered: ‘కడైసి వివాహాయి’ నటి కాసియమ్మాళ్ దారుణ హత్య.. కొడుకే హంతకుడు!

Actress Kasiyammal was Murdered: ‘కడైసి వివాహాయి’ నటి కాసియమ్మాళ్ దారుణ హత్య.. కొడుకే హంతకుడు!

Actress Kasiyammal was Murdered: తమిళనాడులో హత్య కలకలం రేపింది. కడైసి వివాహాయి నటి కాసియమ్మాళ్ ను కన్న కొడుకే పలకతో కొట్టి హత్య చేశాడు. మీడియా కథనాల ప్రకారం.. “కాసియమ్మాళ్ కొడుకు నమ్మకోడి భార్యతో విడిపోయి తల్లిపై ఆధారపడి జీవిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఫిబ్రవరి 4న నమ్మకోడి.. తల్లి కాసియమ్మాళ్ తో డబ్బు విషయంలో ఘర్షన జరిగింది. ఈ ఘర్షణలో కోపంతో ఉన్న నమ్మకోడి తల్లిని చెక్క పలకతో కొట్టి హత్య చేశారు. ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.”


నమ్మకోడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు IPC సెక్షన్ 302 కింద హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు. హత్యాయుధాన్ని సాక్ష్యంగా స్వాధీనం చేసుకున్నారు.

2022 తమిళ చిత్రం “కడైసి వివాహాయి”లో విజయ్ సేతుపతితో కలిసి కాసియమ్మాళ్ ప్రముఖ పాత్రలో కనిపించింది. ఆ పాత్రలో ఆమె నటనకు విమర్శకులు, ప్రేక్షకుల నుండి విస్తృతమైన ప్రశంసలు లభించాయి. “కాకా ముట్టై”లో పనిచేసినందుకు పేరుగాంచిన మణికందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతీయ చలనచిత్రంలో ఇటువంటి విషయాల పట్ల సాంప్రదాయికంగా వ్యవహరించే పద్ధతికి భిన్నంగా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ల యొక్క వాస్తవిక చిత్రణను అందించింది.


రైతుల జీవితాల చుట్టూ తిరిగే కథనం, వారి పోరాటాలు, విజయాలపై రిఫ్రెష్, ప్రామాణికమైన టేక్‌ను అందించింది. విజయ్ సేతుపతి ఉనికి కథనానికి మరింత లోతును జోడించింది. ఈ చిత్రం గ్రామీణ జీవితాన్ని నిజాయితీగా చిత్రీకరించినందుకు అద్భుతమైన సమీక్షలను అందుకున్నప్పటికీ, దురదృష్టవశాత్తు బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరమైన విజయాన్ని సాధించలేకపోయింది.

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×