Big Stories

Man Returns from Germany to Cast vote: ‘నేను జర్మనీ నుంచి వచ్చి ఓటు వేశా’

Man Returns from Germany to Cast vote: ఓటు హక్కు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు, నాయకులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అధికారులు కూడా చాలెంజింగ్ తీసుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంచుతున్నారు. కొంతమంది ఉన్నతాధికారులైతే బస్టాండ్లు, దుకాణాల వద్దకు వెళ్లి మరీ వారితో మాట్లాడి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ తెలిపిన విషయం కూడా తెలిసిందే. అంతేకాదు.. ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే, ఇప్పుడెందుకు ఈ విషయాన్ని గుర్తు చేయాల్సి వచ్చిందేంటే.. శుక్రవారం జరిగిన పార్లమెంటు రెండో విడత ఎన్నికల్లో ఓ యువకుడు ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయం తెలిసి అతడిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

- Advertisement -

ఇందుకు సబంధించి వివరాల్లోకి వెళితే.. దేశంలో శుక్రవారం పార్లమెంటు ఎన్నికల రెండో విడత పోలింగ్ జరిగింది. 13 రాష్ట్రాల్లోని 88 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే, ఉత్తర ప్రదేశ్ లోని గౌతమబుద్ధ నగర్ లో కూడా ఆ లోక్ సభ నియోజకవర్గానికి చెందిన లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

కానీ, ఒక ఓటరు మాత్రం అందరి దృష్టిని ఆకర్శించాడు. ఎందుకంటే అతను జర్మనీ నుంచి వచ్చి ఓటు వేశాడు. అభిషేక్ ఆర్య అనే ఇతను ఉద్యోగరీత్యా జర్మనీకి వెళ్లి గత ఏడేళ్లుగా అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం నోయిడాకు వచ్చాడు. అనంతరం అతను తన సోదరీమణులతో కలిసి నోయిడాలోని సెక్టార్ 31 లోని సరస్వతి బాలికా విద్యా మందిర్ లోని పోలింగ్ బూత్ కు చేరుకున్నాడు. అనంతరం అతను తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏడేళ్లుగా జర్మనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. అయితే తాను కేవలం ఓటు వేయాలన్న ఉద్దేశంతోనే జర్మనీ నుంచి వచ్చి ఓటు వేశానని తెలిపాడు. అదేవిధంగా ఇలా జర్మనీ నుంచి వచ్చి ఓటు వేయడం ఇతరులకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

Also Read: రానున్న రోజుల్లో ప్రధాని మోదీ కన్నీరు పెట్టినా పెట్టొచ్చు: రాహుల్ గాంధీ

ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు.. అతడిని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. జర్మనీ నుంచి వచ్చి ఓటు వేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచావంటూ మెచ్చుకుంటున్నారు. అయితే, శుక్రవారం దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News