E-Paper
Advertisement

Black man in Ohio dies: అమెరికాలో దారుణం, నాడు జార్జ్‌.. నేడు టైసన్, పోలీసుల తీరుపై నిరసనలు..

Black man in Ohio dies: అమెరికాలో దారుణం, నాడు జార్జ్‌.. నేడు టైసన్, పోలీసుల తీరుపై నిరసనలు..
Advertisement

Black man in Ohio dies: అమెరికాలో పోలీసుల దారుణాలకు అంతులేకుండా పోతోంది. ఓ నల్ల జాతీయుడ్ని కింద పడేసి మెడపై మోకాలితో అదిమిపడ్డాడు ఓ పోలీసు అధికారి. తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్ అయ్యింది. దీనికి సంబంధించి వీడియో వెలుగులోకి రావడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరణించిన వ్యక్తి పేరు ఫ్రాంక్ టైసన్, ఆయన వయస్సు 53 ఏళ్లు. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న పోలీసులు ఓ బార్‌లో బలవంతంగా అతడ్ని పట్టుకున్నారు. అయితే టైసన్‌ను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. తనను చంపడానికి పోలీసులు వస్తున్నారంటూ టైసన్ కేకలు వేయడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపించింది. ఆ తర్వాత పోలీసులు అతడ్ని కింద పడేసి చేతికి బేడీలు వేశారు. ఓ అధికారి అతడి మెడపై మోకాలితో అదిమిపట్టాడు.

Advertisement

కొద్దిసేపటికి టైసన్‌ స్పృహ కోల్పోయాడు. వెంటనే బేడీలు తీసి వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఫ్రాంక్ టైసన్ మరణించాడు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఘటన సమయంలో ఉన్న అధికారులను సెలవుపై పంపించారు. ఏప్రిల్ 18న ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి వీడియో వెలుగులోకి రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది.

ALSO READ:  వణికిన తైవాన్, అయితే ఈసారి

Advertisement

ఇప్పటికే ఓ కేసులో 24 ఏళ్లు జైలు అనుభవించిన ఫ్రాంక్ టైసన్, ఏప్రిల్ ఆరున విడుదలయ్యాడు. పెరోల్ కు సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదన్నది పోలీసులు చెబుతున్నమాట. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. నాలుగేళ్ల కిందట అంటే 2020లో మిన్నియాపోలిస్‌లో పోలీసుల దారుణానికి జార్జ్ ఫ్లాయిడ్ ఇదే తరహాలో మరణించాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఫాయిడ్ మరణానికి జాతి వివక్షే కారణమంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే.

 

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×