BigTV English

Amazon Great Summer sale: త్వరలో అమెజాన్ కొత్త సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్..!

Amazon Great Summer sale: త్వరలో అమెజాన్ కొత్త సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్..!

Amazon Great Summer sale will start soon: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఎప్పటికప్పుడు సేల్‌లను ప్రకటిస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటుంది. రకరకాల ప్రొడక్టులపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ అట్రాక్ట్ చేస్తుంది. అయితే అమెజాన్ ఇప్పుడు మరొక కొత్త సేల్‌తో వినియోగదారుల ముందుకు రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగానే ‘అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్’ను త్వరలో ప్రారంభించబోతుంది.


అయితే అందుకు సంబంధించి సేల్ తేదీని, ఏ ఏ ప్రొడక్టులపై ఎంతెంత డిస్కౌంట్లు అందిస్తుందో వెళ్లడించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే తగ్గింపులను అందిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీ ఈ సేల్ వినియోగదారులకు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఒప్పందాలను అందిస్తుందని పేర్కొంది.

సేల్ ఈవెంట్‌కు ముందు అమెజాన్ డిస్కౌంట్లను అందుకోవడానికి సెట్ చేయబడిన ప్రొడక్టుల లిస్ట్‌ను వెల్లడించింది. అందులో 8 OnePlus స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. అధికారిక అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. OnePlus 12, OnePlus Nord CE 4, OnePlus 12R, OnePlus Nord 3తో పాటు మరిన్ని ఉన్నాయి.


Also Read: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ ప్రొడక్ట్స్‌పై 75 శాతం డిస్కౌంట్!

అంతేకాకుండా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో.. Redmi 13C, Redmi Note 13 Pro, Samsung Galaxy M34, Xiaomi 14, Samsung Galaxy S23, iQOO Z9, Galaxy S24, Tecno Pova 6 Pro వంటి మరిన్ని డివైజ్‌లు డిస్కౌంట్‌లను పొందుతాయి. ఇక ఈవెంట్ సమయంలో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లు, ఇతర మోడల్‌ల ఖచ్చితమైన ధరలు రాబోయే రోజుల్లో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి డిస్కౌంట్‌లను పొందే ఐఫోన్‌ల పేర్లను ఇది వెల్లడించలేదు. అయితే సేల్ ఈవెంట్‌లో ఆపిల్ మొబైల్స్ కూడా ఉంటాయని టీజర్ ధృవీకరించింది. ఇక అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌ కూడా అద్భతమైన సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ పేరుతో మరో సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్ మే 3 నుంచి మే 9 వరకు కొనసాగుతుంది. ఇందులో కూడా స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ ఆఫర్లను పొందవచ్చు.

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×