Big Stories

UPSC IFS 2023 : ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

UPSC IFS – 2023 : ఐఎఫ్ఎస్ మెయిన్స్ 2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2023, నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకూ వ్రాత పరీక్షలను నిర్వహించగా అందులో అర్హత సాధించిన వారికి ఏప్రిల్ 22 నుండి మే 01 వరకు పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించారు. అయితే ఇంటర్వ్యూ యొక్క తుది ఫలితాలను మే 8 బుధవారం ప్రకటించారు. అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో రూల్ నంబర్ తో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

- Advertisement -

UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్, అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వంటి వివిధ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహిస్తారు.

- Advertisement -

అర్హతగల అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీలు, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూలు. UPSC అధికారిక వెబ్‌సైట్‌లో ఇంటర్వ్యూ రౌండ్ ముగిసిన వెంటనే రిజల్ట్స్ ప్రకటిస్తారు. రిక్రూట్‌మెంట్ లో ఎంపికైన వారికి భారతీయ అటవీ సేవా అధికారిగా రూ. 56,100 ప్రాథమిక జీతంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్‌లు, లీజు అలవెన్స్, మెడిక్లెయిమ్ లు అందిస్తారు.

Also Read: మూకుమ్మడి సెలవు.. 70కి పైగా ఎయిర్ ఇండియా విమానాలు క్యాన్సిల్

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ, లేదా UPSC IFS పరీక్షకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం అభ్యర్థులు పని దినాలలో 10:00 AM నుంచి 05:00 PM మధ్య సమయంలో 011-23385271 / 23381125 టెలిఫోన్ నంబర్ ద్వారా అధికారులను సంప్రదించవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News