BigTV English

Priyanka Gandhi: ఓటమి భయంతో రాహుల్ పై అసత్య ప్రచారం: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: ఓటమి భయంతో రాహుల్ పై అసత్య ప్రచారం: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Campaign In Rae Bareli: బీజేపీ ఓటమి భయంతోనే రాహుల్ గాంధీపై అసత్య ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. బీజేపీ నేతలంతా రాహుల్ పై ఆరోపణలు చేయడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ప్రసంగించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రియాంక బరేలీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.


ఉత్తరప్రదేశ్ ప్రజలు రాజకీయ నాయకులను బాగా అర్థం చేసుకున్నారని ప్రియాంక గాంధీ తెలిపారు. గతంలో ఇందిరా గాంధీ విధానం నచ్చక ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆత్మపరిశీలన చేసుకుని తిరిగి గెలిపించారని అన్నారు. నాయకులను అర్థం చేసుకోవడం అనేది రాయ్ బరేలీ ప్రజలకు ఉన్న ప్రత్యేకత అని చెప్పారు.

బీజేపీ నేతలు రాహుల్ పై తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఎప్పుడో స్పష్టమైందని పేర్కొన్నారు. కానీ ఎన్నికల్లో ఓడి పోతామనే భయంతో మోదీ మాట మార్చారని ఆరోపించారు. బీజేపీ నేతలు కేవలం మతం, గుడి-మసీదు, కులం గురించి మాత్రమే మాట్లాడుతారని చెప్పారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఎప్పుడూ మట్లాడరని ధ్వజమెత్తారు.


Also Read: దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా.. తూర్పు వాళ్లు చైనీయుల్లా కనిపిస్తారు’.. శామ్ పిట్రోడా

ఇదిలా ఉంటే..యూపీలోని రాయ్ బరేలీ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెబుతారు. 2004 నుంచి సోనియా గాంధీ ఎంపీగా ఇక్కడ కొనసాగుతున్నారు. ఈ సారి లోక్ సభ ఎన్నికల బరిలో నుంచి సోనియా గాంధీ అనారోగ్య కారణాల వల్ల తప్పుకోగా..రాహుల్ గాంధీ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున దినేష్ ప్రతాప్ సింగ్ బరిలో దిగారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×