Big Stories

Rahul Gandhi Comments: రానున్న రోజుల్లో ప్రధాని మోదీ కన్నీరు పెట్టినా పెట్టొచ్చు: రాహుల్ గాంధీ

Rahul Gandhi Comments: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రంగా ఫైరయ్యారు. రానున్న రోజుల్లో ప్రధాని మోదీ కన్నీరు పెట్టినా పెట్టొచ్చు అని ఆయన అన్నారు. శుక్రవారం కర్ణాటకలో ఎన్నికల సభలలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీపై మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రసంగాలు చూస్తుంటే మోదీ ఆందోళనగా ఉన్నట్లుగా తనకు అనిపిస్తుందని.. ఒకవేళ మోదీ కన్నీరు పెట్టినా పెట్టొచ్చు అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు.. దేశంలోని ప్రధాన సమస్యలైనటువంటి పేదరికం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే విధంగా ప్రధాని మోదీ మాట్లాడుతున్నారన్నారు. అంతేకాదు.. కొన్నిసార్లు పాకిస్థాన్, చైనా అంటారు.. ఇంకొన్నిసార్లేమో గిన్నెల శబద్ధం చేయమంటారమని మోదీపై మండిపడ్డారు.

- Advertisement -

దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని ప్రధాన సమస్యలైన పేదరికం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. పేదల సొమ్మును మోదీ బిలియనీర్లకు ఇచ్చారని.. తాము అధికారంలోకి వస్తే ఆ సొమ్మును తిరిగి పేదలకే పంచుతామన్నారు. బీజేపీలు, ఆర్ఎస్ఎస్ లు రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నాయని.. కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. కన్యకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.

- Advertisement -

Also Read: నోటాకు అత్యధిక ఓట్లు వస్తే ఏమవుతుంది.? ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసు

బీజేపీని భారతీయ చెంబు పార్టీగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుగు సాగారు. అయితే, మరో విషయమేమంటే.. నిధుల విషయంలో కేంద్రంపై నిరసనగా కర్ణాటకలో చెంబు బొమ్మలతో ప్రకటనలు వస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News