Rahul Gandi : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర కు మణిపూర్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. ఈనెల 14న మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి ప్రారంభించాలనుకున్నారు. కానీ ఈ యాత్రకు అనుమతి లేనట్లు సమాచారం. తాజాగా మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించినట్లు సమాచారం.
Rahul Gandhi : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర కు మణిపూర్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. ఈనెల 14న మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి ఈ యాత్రను ప్రారంభించాలనుకున్నారు. తాజాగా మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది.
మణిపుర్ పీసీసీ అధ్యక్షుడు కె.మేఘచంద్ర పార్టీ నాయకులతో కలిసి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ యాత్రకు అనుమతి ఇవ్వలేమని ముఖ్యమంత్రి వారికి వెల్లడించారు.
ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరమని మేఘచంద్ర పేర్కొన్నారు. ప్రజాహక్కులు, రాజకీయ హక్కుల ఉల్లంఘనగా దీనిని ఆయన అభివర్ణించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వం యాత్రకు అనుమతులు ఇవ్వకపోవడంతో.. థౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్థలానికి మార్చినట్లు ఆయన వెల్లడించారు.
రాహుల్ యాత్రకు అనుమతుల విషయంలో తమ ప్రభుత్వం పూర్తిగా భద్రతా సంస్థల నివేదికలపైనే ఆధారపడిందని సీఎం బీరేన్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం చాలా సంక్లిష్టంగా మారిందన్నారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో సాగనుంది. తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది.
ఈ యాత్ర జనవరి 14న ఇంఫాల్ తూర్పు జిల్లాలోని హట్టా కాంగ్జేబుంగ్ నుంచి ప్రారంభించాలనుకున్నారు. ఈ యాత్ర దేశ వ్యాప్తంగా 66 రోజుల 6,713 కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది. చివరకు భారత్ న్యాయ్ యాత్ర మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. ఇక రాహుల్ యాత్ర సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల్లో స్థానిక కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఫ్లెక్సీలతో ప్రచారం ప్రారంభించారు.