Big Stories

Chandrababu : ప్రజలను పేదరికంలోకి నెట్టి.. దేశంలో అత్యంత ధనికుడిగా ఎదిగి.. జగన్ పై చంద్రబాబు ఫైర్..

Chandrababu : రాష్ట్రంలో ప్రజలను పేదరికంలోకి నెట్టి జగన్ మాత్రం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో ఆయన ప్రశంగించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో పేదలు సంక్రాంతి పండగను జరుపుకొనే పరిస్థిత లేదని పేర్కొన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పండగ సమయంలో ప్రజలకు ఉచితంగా సరకులిచ్చామని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలో పేదల కోసం అన్న క్యాంటీన్‌లను తీసుకొచ్చి రూ.5 రూపాయలకే పేదల కడుపు నింపామని చెప్పారు.

- Advertisement -

పేదల బలహీనతను అవకాశంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వం దోచుకుంటుందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రమంతా మద్యపాన నిషేధిస్తామని జగన్‌ హామీ ఇచ్చారన్నారు. మద్యపానం నిషేధం చేయకపోతే ఓట్లు అడగనని జగన్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మద్యంపానం నిషేధించకుండా కొత్త రకం బ్రాండ్ లను తీసుకువచ్చి పేదలను దోచుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని ఆరోపించారు. ఒక్క రోజైనా గంజాయి నిర్మూలనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారా? అని ప్రశ్నించారు. గంజాయితో పిల్లలు జీవితాలు నాశనం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

వైసీపీ అధికారంలోకి వచ్చాక 9సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని చంద్రబాబు మండిపడ్డారు. ధరలు పెంచినా కరెంట్ కొరత మాత్రం ఉంటుందన్నారు. టీడీపీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందని స్పష్టం చేశారు. పెంచిన కరెంట్ ఛార్జీలు తమ పార్టీ అధికారంలోకి వచ్చాక తగ్గిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోలార్, పవన విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కొత్త పద్దతులు అనుసరించి కరెంట్ ధరలు తగ్గిస్తామని ప్రకటించారు.

ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ప్రకటించారు. జగన్ ప్రభుత్వం పెన్షన్లు విషయంలో అర్హులను మోసం చేసిందని ఆరోపించారు. టీడీపీ 2019 అధికారంలోకి వస్తే మొదట నుంచి రూ.3 వేల రూపాయలు ఇచ్చే వాళ్ళమని చంద్రబాబు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News