SBI Notification: బ్యాంకింగ్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పాసైన అభ్యర్థులు లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్న అభ్యర్థులైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు – వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీగా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా మొత్తం 6,589 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 26న దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 6589
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
జూనియర్ అసోసియేట్: 6589 ఉద్యోగాలు
రెగ్యులర్: 5180 పోస్టులు
బ్యాక్‌లాగ్ : 1409 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 డిసెంబర్ 31 నాటికి గ్రాడ్యుయేషన్ పాసై ఉంటే సరిపోతుంది.
ముఖ్యమైన డేట్స్..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 6
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 26
వయస్సు: 2025 ఏప్రిల్ 1 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పది నుంచి పదిహేనళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్ – 100 మార్కులు, సమయం 1 గంట), మెయిన్స్ పరీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్ – 200 మార్కులు, సమయం 2 గంటలు 40 నిమిషాలు), స్థానిక భాషా పరీక్ష ఉంటుంది.
తుది ఎంపిక: ప్రధాన పరీక్ష మార్కులు + స్థానిక భాషా పరీక్షలో అర్హత ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
భాషా నైపుణ్యం: స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. స్థానిక భాషను చదివినట్లు రుజువు చేసే 10వ లేదా12వ తరగతి మార్కుల షీట్‌ను సమర్పించని అభ్యర్థులు తుది నియామకానికి ముందు స్థానిక భాషా పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.
కీలక అంశాలు:
ఒక రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ప్రతి తప్పు సమాధానానికి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నియామకం జరిగిన తర్వాత ఇంటర్-సర్కిల్ లేదా ఇంటర్-స్టేట్ బదిలీ ఉండదు. సెప్టెంబర్ 2025లో ప్రిలిమ్స్, నవంబర్‌లో మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. ఉద్యోగ నియామకం ముగిసే వరకు మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీని యాక్టివ్‌లో ఉంచాలి.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 6589
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 26
ALSO READ: Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?
ALSO READ: IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?