BigTV English

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

తోడబుట్టినవారి సుఖ సంతోషాలను కోరేదే రాఖీ పండగ. పేగుబంధం లేకపోయినా చాలామంది సోదర సమానులతో ఈ పండగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రాజకీయ వర్గాల్లో కూడా రాఖీ అనేది సందడిగా జరిగే పండగ. ఏపీ రాజకీయాలకు వస్తే రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న అన్నా చెల్లెళ్లు జగన్, షర్మిల. వీరిద్దరి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో రాఖీ పండగ అనగానే అన్నపై చెల్లెలి అభిమానం, చెల్లెలిపై అన్న అనురాగం మనందరికీ కనపడేవి. కానీ కొన్ని సంవత్సరాలుగా, మరీ ముఖ్యంగా ఇటీవల ఈ అభిమానం ఆవిరైంది, అనుబంధం దూరమైంది. కనీసం ఇద్దరూ ఎదురెదురు పడలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో రాఖీ పండగ శుభాకాంక్షలు అంటూ ఇద్దరూ ట్వీట్లు వేశారు. కానీ ఒకరి పేరు మరొకరు ప్రస్తావించకపోవడం ఇక్కడ విశేషం.


జగన్ ట్వీట్..
“రాష్ట్రంలోని నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.” అంటూ ముక్తసరిగా జగన్ ట్వీట్ వేశారు. కనీసం ఆ పండగను సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కూడా ఆయన కోరలేదు. సుదీర్ఘ ట్వీట్ వేస్తే తన సొంత సోదరి పేరు ఎక్కడ ప్రస్తావించాల్సి వస్తుందనుకున్నారో ఏమో.. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ ముగించారు జగన్.

షర్మిల ట్వీట్..
ఇక షర్మిల మాత్రం కాస్త సుదీర్ఘ ట్వీట్ వేశారు కానీ, అన్న జగన్ పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడం విశేషం. “అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు ప్రతీక రక్షా బంధన్. రాష్ట్రంలోని ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్ని బంధాల కన్నా రక్త సంబంధం గొప్పది. నాతో రక్త సంబంధం లేకపోయినా, YSR అనే మూడక్షరాల అనుబంధాన్ని రక్త సంబంధంగా ఏర్పరుచుకొని నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రతి అన్న, తమ్ముడు సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.” అని షర్మిల తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక్కడ రక్త సంబంధం లేకపోయినా అంటూ ఆమె ప్రత్యేకంగా మెన్షన్ చేశారు కాబట్టి, జగన్ ని పరోక్షంగా విమర్శించారని అనుకోవచ్చు. రక్త సంబంధం లేకపోయినా వైఎస్సార్ అనే అనుబంధంతో తనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న అన్నదమ్ములు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారామె. అంటే రక్త సంబంధం ఉన్నవారెవరూ తనను పట్టించుకోవట్లేదనే ఆవేదన ఆమె ట్వీట్ లో మనకు తెలుస్తుంది.


కేసీఆర్ ఫ్యామిలీ సైలెంట్..
ఇక తెలంగాణలో కూడా ఈ రాఖీ పండగ నాటికి రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీలో రాఖీ సంబరాలు జరగలేదనే చెప్పాలి. కనీసం కేటీఆర్, కవిత నుంచి ట్వీట్లు కూడా లేకపోవడం విశేషం. గతంలో తమ ఇంట్లో జరిగిన రాఖీ సంబరాలను గొప్పగా ప్రచారం చేసుకునే ఆ ఇద్దరు, ఈ ఏడాది పండగనాటికి బద్ధ విరోధులుగా మారడం విశేషం. ఈ ఏడాది రాఖీ పండగ సందర్భంగా కనీసం ప్రజలకు కూడా ఆ ఇద్దరు శుభాకాంక్షలు చెప్పలేదు. ఒకవేళ రాఖీ పండగ కోసం ట్వీట్ వేస్తే తన చెల్లి గురించి నెటిజన్లు ప్రశ్నిస్తారనుకుని కేటీఆర్ సైలెంట్ అయి ఉండొచ్చు, తనకి కూడా అలాంటి ప్రశ్నలే ఎదురవుతాయని కవిత కూడా సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×