Kaantha First Song Out: దుల్కర్ సల్మాన్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాడు. తెలుగు, మలయాళంతో పాటు హిందీ, తమిళ్ చిత్రాల్లోనూ నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా తెలుగు, హిందీలో తన మార్కెట్ ను బాగా పెంచుకున్నాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హ్యిట్రిక్ కొట్టిన దుల్కర్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. దీంతో ప్రస్తుతం అతడి సినిమాలు ఆలోవర్ ఇండియా వైడ్ గా అన్ని భాషల్లోనూ బాగా ఆడుతున్నాయి. అందుకే దర్శకనిర్మాతలు సైతం దుల్కర్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
దుల్కర్ విభిన్న కథలను ఎంచుకుంటూ ఆడియన్స్, ఫ్యాన్స్ కి కొత్త అనుభూతిని అందిస్తుంటాడు. అయితే ఈసారి పీరియాడికల్ డ్రామాతో సిద్ధమయ్యాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం తెరకెక్కుతోన్న ఈ సినిమా పేరు కాంత. ఇందులో దుల్కర్ సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. రానాతో కలిసి దుల్కర్ తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కాంత నుంచి ఫస్ట్ సింగిల్ పేరుతో మెలోడీ సాంగ్ రిలీజ్ చేసింది.
పసి మనసే వినదసలే..
పసి మనసే.. వినదసలే అంటూ సాగే ఫుల్ లిరికల్ సాంగ్ను తాజాగా విడుదల చేశారు. మెలోడియస్ సాగే ఈ పాట సంగీత ప్రియులను ఆద్యాంతం ఆకట్టుకుంటోంది. ఈ పాట, బ్యాగ్రౌండ్ మొత్తం పాత చిత్రాలను గుర్తు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్,టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన లిరికల్ సాంగ్ మూవీ మరింత బజ్ పెంచింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ప్రముఖ గేయ రచయిత కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను ప్రదీప్ కుమార్, ప్రియాంక NK అద్భుతంగా ఆలపించారు. ఇక ఈ పాటలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇందులో దుల్కర్ బ్లాక్ అండ్ వైట్ సూట్ కనిపించగా.. హీరోయిన్ రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో ఆకట్టుకుంది. పాట, బ్యాగ్రౌండ్ థీమ్ మొత్తం 1950 నాటి చిత్రాలను గుర్తు చేస్తుంది. కాగా లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దుల్కర్ నుంచి వస్తున్న చిత్రమిది కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా పీరియాడికల్ డ్రామాగా వస్తుండటంతో మూవీపై భారీ బజ్ నెలకొంది.