Coolie vs War 2 : ఆగష్టు 14కి మరో 5 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ రోజు కోసం ఎంతో మంది సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి… బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ.
మరొకటి… కోలీవుడ్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండల్ వుడ్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కలిసి చేస్తున్న కూలీ. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే.. లోకీ సినిమాటిక్ యూనివర్స్ క్రియేటర్ లోకేష్ కనగరాజ్ దీనికి డైరెక్టర్.
ఈ రెండు పెద్ద సినిమాలు ఆగష్టు 14న థియేటర్స్‌లో రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటి వరకు అయితే, ఈ రెండు సినిమాలను పోలిస్తే.. ఎక్కువ బజ్, హైప్ కూలీ మూవీకే ఉంది. ఇక వార్ 2 మూవీకి ఆ.. బజ్, హైప్ ఉన్నా.. కూలీని మాత్రం మ్యాచ్ చేయలేకపోతున్నాయి.
కూలీకి ఇంత హైప్ ఉండటానికి కారణం… ఒకటి ఆ సినిమాలో హీరో రజనీకాంత్. ఈయన సినిమాలు అంటే, ఆఫీస్, కాలేజీ, స్కూల్స్ కి సెలవులు పెట్టి మరీ చూస్తారు. అలాగే, మరో కారణం… డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. లోకి సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటి వరకు వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ఫెయిల్యూర్ కాదు. పైగా ఈ సినిమాలో ప్రతి ఇండస్ట్రీ నుంచి ఓ స్టార్ హీరోను తీసుకున్నాడు. ఇంకా ముఖ్యమైన పాయింట్… కూలీలో విలన్ నాగార్జున. ఇది ఈ సినిమాకు మరింత బలం పెంచింది. వీటితో పాటు అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయింది.
ఇన్ని ప్లస్ పాయింట్స్, బలమైన పాయింట్స్ ముందు వార్ 2 మూవీ తెలిపోయింది. వార్ 2 మూవీ విషయానికి మాట్లాడితే, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, ట్రైలర్‌లో కనిపించిన కియారా అద్వానీ బికినీ.
అంతకు మించి సినిమాపై హైప్ పెంచడానికి ఒకటి అంటే ఒక్క రీజన్ కూడా లేదు. పైగా ట్రైలర్ వచ్చిన తర్వాత YRF స్పై యూనివర్స్ నుంచి వచ్చిన సినిమాల్లానే ఇది కూడా హై డోస్ యాక్షన్, రోటీన్ స్టోరీ మూవీనే అనే ఫీలింగ్ కి వచ్చేశారు ఆడియన్స్. దీని వల్లే వార్ 2 కంటే కూలీకే ఎక్కువ బజ్ ఉంది.
అయితే, ఇప్పుడు వార్ 2 టీం దీన్ని మార్చుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇలానే రిలీజ్‌కి ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ కలెక్షన్ల పై కూడా ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని మార్చుకోవడానికి వార్ 2 మూవీ ఫైనల్ ఛాన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు (ఆగష్టు 10) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌తో అయినా.. వార్ 2 మూవీ బజ్ క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే, కూలీతో వార్ 2 వార్ చేయడం కష్టమే అవుతుంది.