Indian Navy Notification: నిరుద్యోగ అభ్యర్థులకు మరో భారీ గుడ్ న్యూస్. గత కొన్ని రోజుల నుంచి సెంట్రల్ నుంచి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు విడుదల అవుతున్నాయి. తాజాగా ఇండియన్ నేవీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. టెన్త్ క్లాస్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు- వివరాలు, ఉద్యోగ ఎంపిక విధానం, వయస్సు, దరఖాస్తు విధానం, జీతం, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇండియన్ నేవీలో నుంచి పలు ట్రేడుల్లో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం.. 1,266 సివిలియన్ ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1266
ఇండియన్ నేవీలో సివిలియన్ ట్రేడ్స్ మెన్ స్కిల్డ్ ఉద్యోగ వెకెన్సీలు ఉన్నాయి. సహాయక, సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & గైరో, ఫౌండ్రీ, హీట్ ఇంజిన్లు, ఇన్‌స్ట్రుమెంట్, మెకానికల్, మెకానికల్ సిస్టమ్స్, మెకాట్రానిక్స్, మెటల్, మిల్‌రైట్, రిఫ్రిజిరేషన్ & ఏసీ, షిప్ బిల్డింగ్, వెపన్ ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: టెన్త్ క్లాస్ పాసై ఉంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాస్త ఇంగ్లిష్ పై కూడా నాలెడ్జ్ ఉండాలి.
ముఖ్యమైన డేట్స్:
దరఖాస్తుకు ప్రారంభ తేది: ఆగస్టు 13
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 2
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ. 19,900 నుంచి రూ. 63,200 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: indiannavy.gov.in
ఎలా అప్లై చేసుకోవాలంటే…?
అఫీషియల్ వెబ్ సైట్ indiannavy.gov.in ని సందర్శించండి. రిక్రూట్‌మెంట్ విభాగంపై క్లిక్ చేయండి. సివిలియన్ ట్రేడ్స్‌మన్ స్కిల్డ్ 2025 అప్లికేషన్ లింక్ ఓపెన్ చేయండి. సంబంధిత వివరాలతో రిజిస్టర్ అవ్వండి. అప్లికేషన్ ఫార్మ్‌ను పూరించండి. మీ ఫోటోగ్రాఫ్, సైన్, అవసరమైన సర్టిఫికేట్స్ ను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. దరఖాస్తు ఫీజును చెల్లించి, సబ్మిట్ చేయండి. డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1266
దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబర్ 2
ALSO READ: SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..
ALSO READ: Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..