Vadde Naveen Transfer Trimurthulu: నటుడు వడ్డే నవీన్.. తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా 80s,90s వారికి అతడు బాగా సుపరిచితం. ఇంకా చెప్పాలంటే అలనాటి అమ్మాయిల కలల రాకుమారుడు అని చెప్పాలి. లవ్ ఎంటర్టైనర్ చిత్రాలతో యూత్ ని బాగా ఆకట్టుకున్నాడు. ‘కోరుకున్న ప్రియుడు’, ‘పెళ్లి’, ‘నా హృదయంలో నిదురించే చెలి’, ‘ప్రేమించే మనసు’, ‘చాలా బాగుంది’ వంటి చిత్రాల్లో నటించిన లవర్ బాయ్ గా గుర్తింపు పొందాడు. అప్పట్లో యూత్ లో నవీన్ కి ఉన్న ఫాలోయింగే వేరు. తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ చిత్రాల్లోను నటించి స్టార్ హీరోగా మారాడు.
లవర్ బాయ్ గా మార్క్
తెలుగులో వరుస సినిమాలు చేస్తూ.. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్, సూపర్ హిట్స్ అందుకున్న ఈ హీరో కొంతకాలం తర్వాత కనుమరుగయ్యాడు. వరుసగా హిట్స్ అందుకున్న నవీన్.. అదే సక్సెస్ ని కొనసాగించలేకపోయాడు. వరుసగా ప్లాప్స్ వస్తుండటంతో సినిమాలు ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. అలా వెండితెరకు దూరమయ్యాడు. వన్డే నవీన్ తెరపై కనిపించి దశాబంపైనే అవుతుంది. చివరిగా 2016లో వచ్చిన ఎటాక్, శ్రీమతి కళ్యాణం చిత్రాల్లో నటించాడు. అప్పటి నుంచి నవీన్ తెరపై కనిపించింది లేదు. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఏ సినిమా చేయలేదు. సుమారు పదేళ్ల తర్వాత ఆయన రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా హీరోగా ఓ సినిమా చేస్తున్నారు.
ఇది తెలిసి ఫ్యాన్స్ అంత ఫుల్ ఖుష్ అవుతున్నారు. సినిమా గురించి ఎలాంటి ప్రకటన లేకుండానే.. నేరుగా ఫస్ట్ లుక్, టైటిల్ ని ప్రకటించి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చాడు. కమల్ తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ట్రాన్సఫర్ త్రిమూర్తులు’ టైటిల్. దీనికి నిర్మాత వన్డే నవీన్ కావడం విశేషం. తన కొడుకు పేరుతో ప్రొడక్షన్ ప్రారంభించి అందులో తొలి చిత్రంగా ఆయనే హీరోగా చేస్తుండం విశేషం. ఇందులో ఆయన కానిస్టేబుల్ గా కనిపించబోతున్నాడు. వన్డే క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 ఈ సినిమా నిర్మితమౌతోంది. ఇందులో రాశీ సింగ్ హీరోయిన్. అయితే ఇన్నేళ్ల తర్వాత వన్డే నవీన్ రీఎంట్రీ ఇవ్వడంపై అభిమానులు ఖుష్ అవుతున్నారు.
కానిస్టేబుల్ త్రిమూర్తులుగా
కానీ సినిమాల్లో ఆయన రోల్ పై మాత్రం ట్రోల్స్ వస్తున్నాయి. నిజానికి నటీనటులు ఎవరైనా సినిమాలకు బ్రేక్ వస్తే.. గట్టి రోల్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంటారు. లెజెండ్ తో జగపతి బాబు, యానిమల్ తో పృథ్వీరాజ్ వంటి నటులు పవర్ఫుల్ విలన్ రోల్స్ తో సూపర్ కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయిపోయారు. వారికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. అలాంటి స్టార్ హీరో అయిన నవీన్ కంబ్యాక్ అంటే ఎలా ఉండాలి. పోలీసు పాత్రతో వస్తున్నారంటే.. ఏ ఐపీఎస్, ఐజీ, డీజీపీ అఖరికి ఎస్ఐ రోల్స్ తో వస్తాడనుకుంటే.. కానిస్టేబుల్ గా రీఎంట్రీ ఇస్తున్నాడు. వెండితెరపై ఎంట్రీ అంటే కథ,కథనంలో బలంతో పాటు పాత్రలో మంచి దమ్ము ఉండాలి.
కానీ నవీన్ మాత్రం.. కానిస్టేబుల్ తన రీఎంట్రీ ప్లాన్ చేశాడు. కథ,కథనం బాగుండి ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఒకే.. లేదంటే నవీన్ ప్రయత్నం బెడిసి కొట్టినట్టే అవుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాలంటూ ఇండస్ట్రీ దూసుకుపోతుంది.. నవీన్ మాత్రం ఓ సింపుల్ స్టోరీతో వస్తున్నాడనిపిస్తోంది ఆయన ఫస్ట్ లుక్ చూస్తుంటే. ఇలాంటి కంటెంట్ చిత్రాలు ఓటీటీలో పర్వాలేదు అనిపిస్తాయి. అదే వెండితెరపై ఆకట్టుకోవడం కష్టమనే చెప్పాలి. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న నవీన్.. కాస్తా గట్టిగా ప్లాన్ చేసుంటే బాగుండెదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అదీ కూడా సొంతం నిర్మాణంలో కాబట్టి నవీన్.. ప్రయత్నం ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి.
From silver screen memories to a bold new avatar ✨#VaddeNaveen garu is back — ruling hearts & the screen again, in khaki style!👮🏻♂️
Proudly presenting the #FirstLook of @vaddecreations Production No 1- #TransferTrimurthulu ❤️🔥@vaddenaveen @RashiReal_ @MeeKamalTeja @vamsikaka pic.twitter.com/J0ESA6X2Tm
— vadde creations (@vaddecreations) August 9, 2025