E-Paper
Advertisement

విజయ్ చూపు ఎటు వైపు.. ప్రభుత్వ ఏర్పాటుకు కలిసేదెవరితో?

విజయ్ చూపు ఎటు వైపు.. ప్రభుత్వ ఏర్పాటుకు కలిసేదెవరితో?
Advertisement

TVK Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించింది. ఇప్పటికే 100 సీట్లు గెలుచుకోగా.. మరో 7 స్థానాల్లో లీడ్ లో ఉంది. అయితే తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. ఈ నేపథ్యంలో విజయ్ తో కలిసొచ్చే పార్టీలు ఏవో అనే చర్చ మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకి కాంగ్రెస్‌, పీఎంకే, డీఎండీకే, లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ కీలకం

కాంగ్రెస్‌, డీఎండీకే, లెఫ్ట్‌ పార్టీలు డీఎంకేతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. అన్బుమణి రాందాస్‌ పీఎంకే మాత్రం ఎన్డీయేతో కలిసి పోటీ చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ తగ్గడంతో.. టీవీకేతో కలిసి రావాలని విజయ్ తండ్రి కాంగ్రెస్‌ ను కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీవీకే కాంగ్రెస్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అప్పటికే డీఎంకేతో కలిసి పోటీ చేస్తుండడంతో టీవీకే ఆఫర్ ను రిజెక్ట్ చేసింది. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ కాంగ్రెస్ తన అభిప్రాయం మార్చుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

చిన్న పార్టీల మద్దతు ఎవరికో

Advertisement

ప్రస్తుత ఫలితాల్లో కాంగ్రెస్‌కు 5 సీట్లు, పీఎంకేకు 5, లెఫ్ట్‌ పార్టీలకు చెరో 2 సీట్లు గెలిచే అవకాశం ఉంది. దీంతో మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తే విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు రూట్ క్లియర్ అవుతుంది. అయితే చిన్న చిన్న పార్టీలను కలుపుకుని వెళ్లే బదులుగా అన్నాడీఎంకేతో కలిసి వెళ్లే అంశాన్ని కూడా విశ్లేషకులు సూచిస్తున్నారు. తుది ఫలితాలు వెళ్లడయ్యాక ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రానుంది.

సంకీర్ణంతో సమస్యలు

ఎక్కువ పార్టీలతో కలిస్తే.. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది. పోర్ట్ పోలియోలు, కీలక పోస్టులు.. అలకలు, ఇలా అనేక సమస్యలు మొదలయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఏఐఏడీఎంకేతో కలిస్తే.. రాజకీయ, ప్రభుత్వ అనుభవం ఉన్న పార్టీ కాబట్టి.. టీఎంకేకు భవిష్యత్తులో సమస్యలు మొదలవుతాయని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఏ నిర్ణయం తీసుకుంటారో కీలకంగా మారింది. చిన్న పార్టీల మద్దతు కోరతారా? ఏఐఏడీఎంకేతో జట్టు కడతారా? వేచి చూడాలి.

Advertisement

Also Read: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సమరం.. TVK పార్టీ కీలక నిర్ణయం.. ఏంటంటే?

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×